లక్నో ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో మూడు ఔట్స్ నమోదు కాగా అన్నింటిలోనూ సంజు పాత్ర ఉండటం గమనార్హం. అయితే ఈ మూడు ఔట్ లలో రెండు రన్ అవుట్లు ఒకటి క్యాచ్ అవుట్ కావడం గమనార్హం. 27 పరుగులతో వేగంగా ఆడుతున్న పవర్ హిట్టర్ నికోలస్ పూరన్ ను సంజు అవుట్ చేసిన తీరు అయితే మ్యాచ్ మొత్తానికి హైలైట్ గా మారిపోయింది అని చెప్పాలి. చివరి ఓవర్ ఐదో బంతిని కృణాల్ స్వింగ్ చేసే ప్రయత్నంలో విఫలం అయ్యాడు. అయితే క్విక్ సింగిల్ కోసం పూరన్ ముందుకు పరిగెత్తుకు వచ్చాడు. కృనాల్ సింగిల్ వద్దన్నా కూడా వినలేదు. ఇక కీపర్ సంజు శాంసన్ చేతిలోకి బంతి రావడమే ఆలస్యం మెరుపు వేగంతో డైరెక్ట్ త్రో వేశాడు.
అయితే అప్పటికే అప్రమత్తమైన పూరన్ ఎంత వేగంగా పరిగెత్తుకొచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఎందుకంటే బుల్లెట్ కన్నా వేగంగా దూసుకు వచ్చిన బంతి పూరన్ క్రీజులోకి రాకముందే వికెట్లను గిరాటేసింది. ఇక ఆ తర్వాత రిప్లై లో పూరన్ అవుట్ అని క్లియర్ గా తెలిసింది. అయితే పెవిలియన్ బాట పట్టిన పూరన్ తనను తాను తిట్టుకుంటూ వెళ్లడం ఆసక్తికరంగా మారింది అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారగా.. అక్కడుంది సంజు శాంసన్ ఎవరు తప్పించుకోలేరు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తూ ఉన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి