
ఎందుకంటే ఇప్పటికే సచిన్ సాధించిన ఎన్నో రికార్డులను బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ ఇక ఇప్పుడు సచిన్ 100 సెంచరీల రికార్డుపై కూడా కన్నేసాడు. ఇప్పటికే 76 సెంచరీలతో కొనసాగుతున్నాడు విరాట్ కోహ్లీ. ఎంతోమంది విరాట్ కోహ్లీని సచిన్ టెండూల్కర్ తో పోల్చి చూస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇదే విషయంపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సచిన్ టెండూల్కర్ సాంకేతికంగా అత్యుత్తమమైన బ్యాట్స్‌మెన్ కోహ్లీ రిటైర్ అయిన తర్వాతే అతన్ని సచిన్ తో పోలుస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.
నా కెరియర్ మొత్తంలో నా ప్రత్యర్ధుల్లో నేను కలిసి ఆడిన వారిలో అత్యుత్తమమైన సాంకేతిక బ్యాట్స్‌మెన్ ఎవరు అంటే సచిన్ అని చెబుతాను. మేము బౌలింగ్ లో ఎలాంటి వ్యూహాలతో బరిలోకి దిగిన సచిన్ మమ్మల్ని సమర్థవంతంగా ఎదుర్కొనేవాడు. నా తరంలో నేను చూసిన గొప్ప బ్యాట్స్‌మెన్ అతనే అంటూ చెప్పుకొచ్చాడు. సచిన్ తో కోహ్లీని పోల్చడాన్ని తిరస్కరించాడు. ఆట మారింది నిబంధనలు మారాయ్. ఇప్పుడు బ్యాటింగ్ చేయడం తేలిక. విరాట్‌కు ఇంకా చాలా సమయం కూడా ఉంది. అతను మంచి బ్యాట్స్‌మెన్ అనడంలో సందేహం లేదు. అయితే కోహ్లీ రిటైర్ అయిన తర్వాతే సచిన్ తో పోల్చడం సమంజసం అవుతుంది అంటూ చెప్పుకొచ్చాడు రికీ పాంటింగ్.