అయితే గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్లో అటు బెంగళూరు జట్టు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సెంచరీ తో చెలరేగి పోయినప్పటికీ కూడా..అటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించ లేక పోయింది అని చెప్పాలి. దీంతో ఈసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవాలనే కల కలగానే మిగిలి పోయింది.దీంతో అభిమానులు అందరూ కూడా నిరాశలో మునిగి పోయారు అని చెప్పాలి. అయితే ఇక ఐపీఎల్ లో తన ప్రదర్శన పై విరాట్ కోహ్లీ ఇటీవల స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
2023 ఐపీఎల్ సీజన్లో తన ఆట తీరుతో ప్రస్తుతం సంతృప్తి కరంగా ఉన్నాను అంటూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అన్నాడు. అయితే ఇటీవలే గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్లో బెంగళూరు జట్టు ఓడిపోవడం మాత్రం ఎంతగానో బాధించింది అంటూ చెప్పుకొచ్చాడు. చాలామంది తన టి20 క్రికెట్లో వేగం తగ్గింది అని అంటున్నారు. అయితే తాను ఆటను ఎంజాయ్ చేస్తున్నాను అంటూ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఇక చివరి మ్యాచ్లో సెంచరీ చేయడం ఎంతో బాగుందని సెంచరీ సంతోషాన్ని ఇచ్చిన.. అటు జట్టు ఓటమితో మాత్రం బాధపడ్డాను అంటూ చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి