ఏకంగా సామాన్యుడికి టమాట ధర అందుబాటులో లేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఇక టమాటా రైతులు పెరిగిన ధరతో సంతోషంలో మునిగిపోయిన.. సామాన్యులు మాత్రం టమాటా లేకుండా వంటకాలు వండుకోవడం ఎలా అని ఆందోళనలో మునిగిపోయారు. అయితే టమోటా ధర పెరిగిపోవడం ద్వారా ఇక టమాటా రైతులు ఎంతలా లాభాలు ఆర్జిస్తున్నారు అన్నదానికి నిదర్శనంగా ఇక్కడ ఒక ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఆ రైతు ఎప్పటిలాగానే టమాట పంట వేశాడు. కానీ ప్రస్తుతం మార్కెట్లో టమాటాకు పెరిగిన డిమాండ్ నేపథ్యంలో అతనికి ఊహించని రీతిలో లాభాలు వచ్చాయి అని చెప్పాలి.
ఈ క్రమంలోనే కేవలం టమాటాలు అమ్మడం ద్వారానే సదరు రైతు ఏకంగా 38 లక్షల రూపాయలు సంపాదించాడట. కర్ణాటక కోలార్ ప్రాంతానికి చెందిన ప్రభాకర్ గుప్తా అనే రైతుకు ఈ సీజన్లో రికార్డు స్థాయిలో 38 లక్షల రూపాయలు ఆదాయం వచ్చిందట. 15 కిలోలు ఉండే ఒక్కో టమాటా బాక్సు రేటు 1900 రూపాయలు పలికిందని.. ఆయన సంతోషం వ్యక్తం చేశాడు. ఇక ఇలా రెండువేల బాక్సులను విక్రయించాను అంటూ చెప్పుకొచ్చాడు. అయితే రెండేళ్ల కిందట అత్యధికంగా ఒక బాక్స్ 850 రూపాయలకు అమ్మానని.. ఇక ఇప్పుడు రికార్డు స్థాయి ధర పలకడంతో లాభాలు భారీగా వచ్చాయి అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు రైతు ప్రభాకర్ గుప్తా.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి