అయితే ఇటీవల ఎమర్జెన్ ఆసియా కప్ అండర్ 23 క్రికెట్ టోర్నీలో భాగంగా భారత్ ఏ, పాకిస్తాన్ ఏ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో అటు భారత జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసింది అని చెప్పాలి. ఏకంగా బ్యాటింగ్లో బౌలింగ్లో అదరగొట్టిన భారత ఏ జట్టు 8 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించింది. కాగా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది పాకిస్తాన్ ఏ జట్టు. ఈ క్రమంలోనే 48 ఓవర్లలో 205 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ఇక ఆ తర్వాత లక్ష్య చేదనలో 36.4 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది టీమిండియా.
సాదరణంగా పాకిస్తాన్ తో మ్యాచ్ అంటే భారత బ్యాట్స్మెన్లు పూనకం వచ్చినట్లుగా ఊగిపోతూ ఉంటారు. అచ్చంగా ఇటీవల పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఏ జట్టు ఒపెనర్ సాయి సుదర్శన్ సెంచరీ తో చెలరేగిపోయాడు. 110వంతులు 104 పరుగులు చేసి నాట్ ఔట్ గా నిలిచాడు. ఇందులో 10 ఫోర్లు మూడు సిక్సర్లు ఉండడం గమనార్హం. ఒకరకంగా అతను ఒక్కడే భారత బౌలర్ల భరతం పట్టి ఇక జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు అని చెప్పాలి. అంతేకాదు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా కూడా నిలిచాడు. ఇక ఈ విషయం గురించి తెలిసి పాకిస్తాన్ తో మ్యాచ్ అంటే భారత ఆటగాళ్లలో.. ఆ మాత్రం కసి ఉంటుంది అంటూ ఎంతో మంది టీమిండియా ఫ్యాన్స్ కామెంట్లు చేస్తూ ఉన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి