దేశంలోనే నాలుగవ అతిపెద్ద రైల్వే రవాణా వ్యవస్థగా కొనసాగుతూ ఉంది భారత్.. అయితే ఇక భారత్లో రైల్వే సౌకర్యాలను ఎంతోమంది ఉపయోగించుకుంటూ ఉంటారు. ప్రతి రోజు కోట్ల మంది రైల్వే ప్రయాణాలు సాగిస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే అతి తక్కువ ఖర్చు తో కూడిన ప్రయాణం కావడం.. ఇక దూర ప్రాంతాలకు ప్రయాణం చేయాలి అంటే అటు రైల్వే ప్రయాణం ఎంతో సౌకర్యవంతం గా ఉండడంతో.. ఎంతో మంది రైలు ప్రయాణాలను ఆశ్రయిస్తూ ఉంటారు.


 ఇంకొంతమంది రోజు వారి ప్రయాణాల లో కూడా ఇక లోకల్ ట్రైన్ల ద్వారా ప్రయాణం సాధిస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇలా రైలు ప్రయాణాలు తరుచుగా చేసేవారు.. రైలు గురించి ఏదైనా అడిగితే టక్కును చెప్పేస్తూ ఉంటారు. ముఖ్యంగా రైలు ముందుకు లేదా వెనక్కి దూసుకు పోవాలంటే ఏముండాలి అని అడిగితే రైల్లో ఇంధనంతో పాటు అటు లోకో పైలట్ కూడా ఉండాలని చెబుతూ ఉంటారు. కానీ లోక పైలెట్ లేకుండా రైలు దూసుకుపోవడం ఎప్పుడైనా చూసారా. ఇది వినడానికే వింతగా అనిపిస్తుంది కదా. కానీ నిజంగానే చోటుచేసుకుంది.


 జార్ఖండ్లో ఈ ఘటన వెలుగు చూసింది. ఇంజన్ లేకుండానే ట్రాక్ పై రైలు భోగి నడుస్తూ ఉండడం వైరల్ గా మారిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఒక ట్రాక్ పై గూడ్స్ రైలు నిలబెట్టి ఉంది. అదే ట్రాక్ పై మెయింటెనెన్స్ కోసం నిలబడి ఉన్న నాలుగు భోగిలను ఢీకొట్టడంతో ఇక భోగి ట్రాక్ పై పరుగులు తీయడం ప్రారంభించింది. ఇది చూసిన జనాలు ఒక్కసారిగా భయపడిపోయారు. సాహెబ్ గంజ్ లోని మాల్దా రైలు డివిజన్ పరిధిలో ఉన్న బర్హార్వ రైల్వే స్టేషన్లో ఇలా ఇంజన్ లేకుండా రైలు నడవడం జరిగింది. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో చూసేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: