పాకిస్తాన్ ఫేసర్ షాహిన్ షా ఆఫ్రిది  ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో ఉన్న అత్యుత్తమ పేసర్లలో ఒకడిగా కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి. ఎప్పుడు తన బౌలింగ్ తో ప్రత్యర్ధులను భయపెడుతూ ఉంటాడు. తాను వేసే బంతుల్లో వేరియేషన్స్ చూపిస్తూ కీలకమైన వికెట్లను పడగొడుతూ ఉంటాడు అని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే షాహిన్ ఆఫ్రిది బౌలింగ్ అటు పాకిస్తాన్ జట్టుకి ఒక ప్రధాన బలం అనడంలో సందేహం లేదు.


 అయితే పాకిస్తాన్ స్టార్ షాహిన్ ఆఫ్రిది పాకిస్తాన్ మాజీ ఆటగాడు షాహీద్ ఆఫ్రిది అల్లుడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తన అల్లుడు గురించి ఈ పాకిస్తాన్ మాజీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు  ఆరంభంలోనే వికెట్ దక్కకపోతే షాహిన్ కు పిచ్చెక్కుతుంది అంటూ షాహిద్ చెప్పుకొచ్చాడు. తొలి స్పెల్ లో ఒకవేళ షాహీన్ కు వికెట్ దక్కలేదు అంటే అతను కోపోద్రిక్తుడు అవుతాడు అంటూ చెప్పుకొచ్చాడు. కేవలం క్రికెట్ మ్యాచ్ అనే కాదు ఎప్పుడు కూడా ఇంతే అంటూ షాహిన్ ఆఫ్రిది కామెంట్ చేశాడు. అయితే అల్లుడు షాహిన్ పై మామ అఫ్రిది చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయాయి అని చెప్పాలి.


 ఆసియా కప్ టోర్నీలో భాగంగా షాహిన్ ఆఫ్రిది ఎప్పటిలాగానే తన బౌలింతో అదిరిపోయే ప్రదర్శన చేశాడు అన్న విషయం తెలిసిందే. అయితే పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అభివృద్ధి పెద్ద కుమార్తె అన్ష ఆఫ్రిదితో ఈ ఏడాది ఆరంభంలోనే షాహిన్ కు వివాహం జరిగింది. ఇకపోతే ఇటీవలే పాకిస్తాన్ జట్టు అటు శ్రీలంక చేతిలో ఓడిపోవడంతో చివరికి ఆసియా కప్ టోర్ని నుంచి నిష్క్రమంచే పరిస్థితిని కొని తెచ్చుకుంది అన్న విషయం తెలిసిందే. దీంతో పాకిస్తాన్ కు వన్డే ఫార్మాట్లో జరుగుతున్న ఆసియా కప్ లో ఛాంపియన్గా నిలవాలి అన్న కల కలగానే మిగిలిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: