
ఈ ఘటన థాయిలాండ్ లో వెలుగు లోకి వచ్చింది అని చెప్పాలి. ఇలా పిల్లల విషయం లో కరకశంగా రాక్షసుడిలా ప్రవర్తించిన తండ్రి పేరు సాంగ్సక్. పిల్లలు ఏడవడంతో కోపంతో ఊగి పోయిన సాంగ్సక్ వారిని దారుణం గా చంపేసినట్లు పోలీసు విచారణలో తేలింది. అయితే సదరు తండ్రి మానసిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్నాడు అన్న విషయాన్ని కూడా స్థానికులు తెలిపారు. అయితే 12 ఏళ్ళ కూతురిని తండ్రి వేధిస్తున్నాడని ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఆ బాలికను రక్షించారు. అయితే తన రెండేళ్ల చెల్లెలిని కూడా తండ్రి కొట్టడంతో ఆమె చనిపోయిందని 12 ఏళ్ల బాలిక పోలీసుల ముందు చెప్పింది. ఆ చిన్నారి మృతదేహాన్ని ఎక్కడ పాతిపెట్టారు అన్న విషయాన్ని కూడా పోలీసులకు తెలిపారు. ఈ క్రమంలోనే పోలీసులు రంగంలోకి దిగి 2 ఏళ్ళ చిన్నారి మృతదేహాన్ని వెలిక్కి తీశారు అయితే గతంలోనూ ఇలా మూడో భార్య పిల్లలను సాంగ్సక్ చంపిన విషయం ఇక పోలీసు విచారణలో తేలింది అని చెప్పాలి. అయితే ఇలా గతంలో చంపిన పిల్లల మృతదేహాలు పాతిపెట్టిన చోటులో ప్రస్తుతం పెట్రోల్ బంక్ ఉన్నట్లు తేలింది. ఘటన కాస్తా స్థానికంగా సంచలనంగా మారిపోయింది.