ప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఓటమి ఎరుగని జట్లుగా కొనసాగుతున్న ఇండియా, న్యూజిలాండ్ మధ్య ఇటీవల మ్యాచ్ జరిగింది. అయితే ఈ రసవత్తరమైన పోరుకు ధర్మశాల స్టేడియం ఆతిథ్యం ఇచ్చింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో టీమ్ ఇండియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత వన్డే వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ పై విక్టరీ సాధించగలిగింది టీమిండియా.


 ఈ క్రమంలోనే వరుసగా 5 విజయాలతో 10 పాయింట్లు సాధించి ప్రస్తుతం పాయింట్లు పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక ఈ వరల్డ్ కప్ లో మొదటి ఓటమిని చవిచూసిన న్యూజిలాండ్ పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో ఉంది అని చెప్పాలి. అయితే న్యూజిలాండ్తో మ్యాచ్లో టీమిండియా గెలిచినప్పటికీ అటు భారత జట్టు ఆటగాళ్ళ ఫీల్డింగ్ మాత్రం ప్రేక్షకులకు అస్సలు నచ్చలేదు. ప్రపంచ క్రికెట్లో పటిష్టమైన జట్టుగా ఉన్న టీమ్ ఇండియాలోని ఆటగాళ్లు ఫీల్డింగ్  ప్రమాణాలు దారుణంగా ఉన్నాయి అని చెప్పాలి. భారత ఆటగాళ్లు ఎంతోమంది కీలకమైన క్యాచ్ లను మిస్ చేశారు.


 దీంతో ఇలా వచ్చిన ఛాన్స్ ని సద్వినియోగం చేసుకున్న న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లు అదరగొట్టారు. అయితే అందరూ ఇలా క్యాచ్ లు మిస్ చేస్తున్న వేళ అటు శ్రేయస్ అయ్యర్ మాత్రం ఒక మెస్మరైజింగ్ క్యాచ్ తో మెరిసాడు. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ వేదిక వైరల్ గా మారిపోయింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వేసిన మహమ్మద్ సిరాజ్ బౌలింగ్లో కాన్వే మిడ్ వికెట్ దిశగా షాట్ ఆడాడు. ఈ క్రమంలోనే అక్కడ ఫీలింగ్ చేస్తున్న శ్రేయస్ అయ్యర్ తన కుడివైపుకు డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. అయితే శ్రేయస్ అయ్యర్ క్యాచ్ అందుకున్న తీరు చూసి కాన్వె సైతం బిత్తరపోయాడు. అయితే ఇలా క్యాచ్ పట్టిన తర్వాత వెంటనే డగ్ అవుట్ లో ఉన్న భారత ఫీల్డింగ్  కోచ్ దిలీప్ పైపు చూస్తూ మెడల్ తనకే అంటూ శ్రేయస్ సైగలు చేయడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: