ప్రస్తుతం వరల్డ్ కప్ లో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగా జరుగుతుంది. సెమీఫైనల్ మ్యాచులు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇక పాయింట్ల పట్టికలో మొదటి నాలుగు స్థానాలలో నిలబడమే లక్ష్యంగా అన్ని టీమ్స్ కూడా పోటీ పడుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే మొన్నటి వరకు వరుస ఓటమిలతో సతమైన టీమ్స్ సైతం పుంజుకుంటూ వరుస విజయాలు సాధిస్తున్నాయి. అయితే ఇలా సెమీఫైనల్కు అంతకంతకు చేరువవుతూ వచ్చింది ఆస్ట్రేలియా. అయితే టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మొదట్లో వరుస పరాజయాలతో సతమతమైంది.


 ఆస్ట్రేలియా ఆట తీరు చూస్తే ఇక సెమి ఫైనల్ అడుగు పెట్టడం కష్టమే అని కొంతమంది అభిమానులు కూడా నిరాశలో మునిగిపోయారు. కానీ ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్న ఆస్ట్రేలియా వరుసగా నాలుగు మ్యాచ్లలో విజయాన్ని సాధించింది. ఈ క్రమంలోనే పాయింట్లు పట్టికలో కూడా అంతకందుకు పైకి దూసుకొచ్చి.. ఇక ఇప్పుడు మూడో స్థానంలో కొనసాగుతుంది. ఇలా సెమీఫైనల్కు ఆస్ట్రేలియా దూరమవుతున్న నేపథ్యంలో ఆ జట్టుకు మాత్రం ఊహించని ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఇప్పటికే జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న మ్యాక్స్వెల్ ఇటీవల ఒక ఘటనలో గాయాల బారిన పడటంతో జట్టుకు దూరమయ్యాడు అన్న విషయం తెలిసిందే.



 అయితే అతని స్థానంలో ఎవరిని రీప్లేస్ చేయాలా అని ఆలోచిస్తున్న సమయంలో ఇప్పుడు ఆస్ట్రేలియాకు మరో ఎదురు దెబ్బ తగిలింది అన్నది తెలుస్తుంది. స్టార్ ఆల్ రౌండర్ మిచెల్ మార్చ్ కూడా స్వదేశానికి వెళ్ళాడట. వ్యక్తిగత కారణాలతో అతను ఇక ఇండియా నుండి పెర్త్ కి వెళ్ళాడు అన్నది తెలుస్తుంది. అయితే అతను తిరిగి మళ్ళీ జట్టులోకి చేరడం విషయంలోనూ అనిశ్చితి నెలకొంది అని చెప్పాలి. కాగా శనివారం ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లాండ్ తో మ్యాచ్ ఆడబోతుందట. దీంతో ఇద్దరు కీలక ఆటగాళ్ళు దూరం కావడంతో ఆస్ట్రేలియా వ్యూహాలు మొత్తం తారుమారు అయిపోయాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc