ఇప్పటివరకు ఆరు మ్యాచ్లు ఆడిన శ్రీలంక జట్టు కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించింది. నాలుగు మ్యాచ్లలో కూడా దారుణమైన పరాజయాలని చవిచూసింది అని చెప్పాలి. ఇందులో చిన్న జట్ల చేతిలో ఓటములు కూడా ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే ఈరోజు ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతూ ఉండడంతో శ్రీలంక పై విజయం సాధిస్తే భారత జట్టు అఫీషియల్ గా సెమి ఫైనల్లో అడుగు పెట్టేస్తుంది. అదే సమయంలో అటు శ్రీలంక జట్టుకు మాత్రం ఇది డు ఆర్ డై మ్యాచ్ గా మారింది అని చెప్పాలి. భారత్తో మ్యాచ్లో శ్రీలంక జట్టు తప్పక గెలవాల్సిన పరిస్థితి ఉంది.
ఎందుకంటే ఈ మ్యాచ్ లో గెలిస్తేనే సెమీఫైనల్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. లేదంటే ఈ మ్యాచ్ లో భారత్ చేతిలో శ్రీలంక జట్టు ఓడిపోయిందా చివరికి ఇక తట్ట బుట్ట సర్ధుకొని ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పాలి. ఎందుకంటే ఈ మ్యాచ్ ఓడిందో టోర్ని నుంచి శ్రీలంక జట్టు నిష్క్రమించడం దాదాపు కాయం కానుంది అయితే ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా జట్టును సొంత గడ్డమీదనే ఓడించడం మాత్రం అటు శ్రీలంకకు పెద్ద సవాల్ తో కూడుకున్న విషయమే అని చెప్పాలి. కానీ డు ఆర్ట్ డై మ్యాచ్ కావడంతో శ్రీలంక జట్టు కూడా మంచి ప్రదర్శన చేసే అవకాశం ఉందని అందరూ అంచనా వేస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి