అయితే ఈ ఎలుకల ప్యాడ్స్ పై గత కొంతకాలం నుంచి ఒక్కో రాష్ట్ర ప్రభుత్వం నిషేధం వేధిస్తూ వస్తుంది. అయితే ఇలా ఎలుకల ప్యాడ్స్ ని వాడుతూ హింసిస్తున్న వారిని జంతు హింస చట్టం 1960 ప్రకారం చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్ అరుణాచల్ ప్రదేశ్, గోవా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడక్, లక్షద్వీప్, మేఘాలయ, మిజోరాం, సిక్కిం, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరఖండ్ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు ఇప్పటికే ఈ ప్యాడ్స్ నిషేధించాయి.
అయితే ఈ జిగురు బోర్డును ఉపయోగించడం వల్ల ఎలుకలు వాటి పైకి రాగానే ఇరుక్కుపోతుంది. దీని తర్వాత అది విసిరి వేయబడుతుంది. ఈ క్రమంలోనే ఈ పేపర్ బోర్డును నిషేధించిన 17వ రాష్ట్రంగా పంజాబ్ అవతరించింది. కేవలం ఎలుకలు మాత్రమే కాదు ఉడుతలు పక్షులను చంపడానికి కూడా ప్రజలు దీనిని ఉపయోగిస్తున్నారు. అయితే ఈ ప్యాడ్స్ ద్వారా దారుణంగా ఎలుకలను చంపడంతో సామాజిక కార్యకర్తలు దీనిని నిషేధించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే ఇక ఇటీవల పంజాబ్ రాష్ట్రంలో కూడా ఇలాంటి డిమాండ్లు ఎక్కువ కావడంతో గ్లూ జీగురు ప్యాడ్స్ ని రాష్ట్ర ప్రభుత్వం కూడా నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి