అయితే భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర వహిస్తూ.. తన బౌలింగ్ తో అందరినీ ఫిదా చేసేస్తూ వున్నాడు మహమ్మద్ షమి. ఆరంభ మ్యాచ్లలో అతను బెంచ్ కే పరిమితమైనప్పటికీ హార్థిక్ పాండ్యా గాయపడటంతో జట్టులోకి వచ్చాడు. అయితే ఇలాంటి ఆణిముత్యాన్నా ఇన్ని రోజులు పక్కన పెట్టాం అనే రేంజ్ లో అతని ప్రదర్శన సాగిస్తూ ఉన్నాడు. ప్రతి మ్యాచ్ లో కూడా ఐదు వికెట్లు పడగొట్టడమే లక్ష్యంగా బంతులు విసురుతున్నాడు మహమ్మద్ షమి.
అయితే ఇప్పటికే వరల్డ్ కప్ లో ఏకంగా 5 వికెట్లు రెండుసార్లు సాధించిన షమి.. ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలోనే భారత బౌలర్ షమి వరల్డ్ కప్ హిస్టరీ లో ఒక అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఒకే వరల్డ్ కప్ ఎడిషన్ లో మూడు సార్లు ఐదేసి వికెట్లు తీసిన తొలి ప్లేయర్గా నిలిచాడు. ఇప్పటివరకు ఈ వరల్డ్ కప్ ఎడిషన్ లో ఆరు ఇన్నింగ్స్ లో షమీ 23 వికెట్లు తీశాడు. అయితే న్యూజిలాండ్ పైనే రెండుసార్లు ఐదు వికెట్ల హాల్ సాధించడం గమనార్హం. అంతేకాదు నాకౌట్ మ్యాచ్ లలో ఐదు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా రికార్డ్ సృష్టించాడు. ఇక శమీ అద్భుతమైన ప్రదర్శనకు క్రికెట్ ప్రపంచం మొత్తం ఫిదా అయింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి