
సుదీర్ఘమైన ఫార్మాట్ కు సరిపోయే ఆట తీరుతో నెమ్మదిగా ఆడే పుజార.. అయితే టీమ్ ఇండియా నయా వాల్ అనే ఒక బిరుదును కూడా సొంతం చేసుకున్నాడు. ఇక అజంక్య రహనే అయితే విరాట్ కోహ్లీకి డిప్యూటీగా ఎన్నో రోజులపాటు భారత జట్టును ముందుకు నడిపించాడు. కోహ్లీకి విశ్రాంతి ప్రకటించిన సమయంలోను జట్టు కెప్టెన్సీ చేపట్టి అద్భుతమైన విజయాలు అందించాడు అని చెప్పాలి. అయితే గత కొంతకాలం నుంచి వీరికి భారత జట్టులో చోటే లేకుండా పోయింది. ప్రేక్షకులు కూడా దాదాపు ఈ ఇద్దరిని మరిచిపోయారు అని చెప్పాలి.
అయితే ఇక ఇన్ని రోజుల తర్వాత మరోసారి ఈ సీనియర్ క్రికెటర్లకు సంబంధించిన చర్చ తెర మీదకి వచ్చింది. టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ అయిన ఈ ఇద్దరు కెరియర్ ముగిసినట్లే కనిపిస్తుంది. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా తో టెస్టు సిరీస్ ఆడబోయే భారత జట్టు వివరాలను ఇటీవల బీసీసీఐ ప్రకటించింది. అయితే జట్టు ఎంపికలో ఇద్దరు సీనియర్ ప్లేయర్లను బీసీసీఐ పరిగణలోకి తీసుకోలేదు. ప్రస్తుతం కౌంటీ క్రికెట్లో ఇద్దరు సీనియర్లు రాణిస్తున్నారు. అయినప్పటికీ భారత జట్టులో విఫలమవుతున్నారు. ఈ ఏడాది జూన్ లో ఆస్ట్రేలియా తో టెస్ట్ పూజారకు చివరిది కాగా.. జూలైలో వెండితో టెస్ట్ రహానేకు చివరిది.