
ప్రస్తుతం పాకిస్తాన్ నేషనల్ టి20 కప్ లో భాగంగా ఇలాంటిదే జరిగింది. ఇటీవల అబోట బాద్, సియాల్ కోట్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇక ఈ మ్యాచ్ లో సియాల్కోట్ ఓపెనర్ పాక్ యువ బ్యాట్స్మెన్ మీర్జా తాహిర్ నూ దురదృష్టం వెంటాడింది. ఎవరు ఊహించని విధంగా హిట్ వికెట్ గా తాహిర్ వెనుతిరిగాడు. సియాల్కోట్ ఇన్నింగ్స్ సమయంలో 12 ఓవర్ వేసిన స్పిన్నర్ యాసిర్ షా బౌలింగ్లో తాహిర్ బ్యాక్ ఫుట్ లో నుంచి ఫుల్ షాట్ ఆడెందుకు ప్రయత్నించాడు. షాట్ బాగానే ఆడాడు. కానీ వెనక్కి వెళ్లి షాట్ ఆడే క్రమంలో అతని బరువు బ్యాక్ ఫుట్ పై పడింది. దీంతో ఒకసారిగా తాహిర్ కుడికాళి కండరాలు పట్టేసాయి. ఈ క్రమంలోనే నొప్పితో విలవిలలాడుతూ బ్యాలెన్స్ కోల్పోయి స్టంప్స్ పై పడిపోయాడు. చివరికి 38 పరుగుల వద్ద అతను హిట్ వికెట్ గా నిరాశతో మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారింది. కాగా ఈ మ్యాచ్ లో అబ్బోటా బాద్ జట్టు విజయం సాధించింది.
క్రికెట్ లో ఇలాంటి ఫన్నీ మూమెంట్స్ జరగడం కొత్తవి కాదు ఇప్పటివరకు ఎంతోమంది స్టార్ ప్లేయర్స్ సైతం అనూహ్యంగా ఇలా హిట్ వికెట్గా వెనుతిరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక ఇప్పుడు ఇలాంటిదే జరగగా ఈ వీడియో చూసి నేటిజన్స్ షాక్ అవుతున్నారు.