
ఈ క్రమంలోనే భారత కుర్రాళ్ళు ఎలా అదరగొడతారు అనే విషయంపై అందరిలో ఉత్కంఠ ఉంది. అయితే సీనియర్ ప్లేయర్ల లాగానే ఈ అండర్ 19 కుర్రాళ్ళు కూడా అదరగొట్టి ఆసియా కప్ ట్రోఫీ గెలుచుకోవడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు కూడా అంచనా వేశారు. ఇటీవల ఈ ప్రతిష్టాత్మకమైన ట్రోఫీలో భాగంగా తొలి మ్యాచ్ ఆడింది అండర్ 19 టీమ్ ఇండియా. ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో వారు వన్ సైడ్ అన్నట్లుగా టీమిండియా తమ ప్రదర్శన చేసింది అని చెప్పాలి. ఏకంగా మొదటి మ్యాచ్ లోనే ఆఫ్గనిస్తాన్ పై పూర్తి ఆధిపత్యం చాలా ఇంచి ఘన విజయాన్ని అందుకుంది. ఏకంగా ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకోవడం గమనార్హం.
అయితే వన్డే ఫార్మాట్లో జరుగుతున్న ఈ ఆసియా కప్ టోర్నీలో భాగంగా ఇటీవల జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసింది ఆఫ్గనిస్తాన్ జట్టు. ఈ క్రమంలోనే నిర్ణీత 50 ఓవర్లలో 173 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ఇక ఆ తర్వాత స్వల్ప లక్ష్య చేదనతో బరిలోకి దిగిన భారత జట్టు.. 37.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి టార్గెట్ ను చేదించింది. కెప్టెన్ కులకర్ణి మూడు వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్లో 70 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు అని చెప్పాలి. ఇకపోతే ఈనెల 10వ తేదీన ఈ టోర్నీలో భాగంగా పాకిస్తాన్ జట్టుతో భారత్ టీం తలబడబోతుంది.