ఏకంగా శ్రీలంక క్రికెట్ బోర్డుపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయారు అని చెప్పాలి. అయితే శ్రీలంక క్రికెట్ బోర్డు వ్యవహారాలలో ప్రభుత్వం జోక్యం ఎక్కువ అవడం కారణంగానే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఇలాంటి నిర్ణయం తీసుకుంది. అయితే స్వయంగా ఇక లంక బోర్డు అధికారులు ఇలా క్రికెట్ బోర్డుపై నిషేధం విధించాలని కోరారు అనే విషయం కూడా తర్వాత తెర మీదికి వచ్చింది. అయితే ఇక శ్రీలంక క్రికెట్ బోర్డుపై విధించిన నిషేధం విషయంలో ఐసీసీ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది.
లంక క్రికెట్ బోర్డుపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇక నిషేధం తొలగిపోవడంతో ప్రస్తుతం మళ్ళీ అంతర్జాతీయ మ్యాచ్లకు సిద్ధమవుతుంది శ్రీలంక జట్టు. కాగా శ్రీలంక క్రికెట్ జట్టు నూతన సెలక్షన్ కమిటీని ఇటీవల ఆ దేశ క్రీడా శాఖ మంత్రి హరిణ్ ఫెర్నాడో నియమించారు. అయితే శ్రీలంక మాజీ క్రికెటర్ ఉపుల్ తరంగను చైర్మన్గా ఎంపిక చేశారు అని చెప్పాలి. ఐదుగురు సభ్యుల కమిటీని నియమించారు. ఇక ఈ కమిటీ జట్టు ఎంపికలో కీలకంగా వ్యవహరించబోతుంది అని చెప్పాలి. త్వరలో జింబాబ్వే తో జరిగే వైట్ బాల్ సిరీస్ కి కూడా జట్టును ఇక నూతన కమిటీని ఎంపిక చేయబోతుంది అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి