అందాల రాక్షసి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరిని ఫిదా చేసేసింది లావణ్య త్రిపాఠి. అమాయకమైన ఆడపిల్లలా కనిపించి కుర్ర కారు మతి  పోగొట్టింది అని చెప్పాలి. ఇక ఆ తర్వాత సినిమాలో వరసగా అవకాశాలు అందుకొని ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్గా హవా నడిపించింది అని చెప్పాలి. అయితే ఇటీవలే లావణ్య త్రిపాఠి కొణిదెల వారి కోడలుగా మారిపోయింది. ఎన్నో రోజుల నుంచి కొణిదెల వారి వారసుడు వరుణ్ తేజ్ తో ప్రేమాయణం కొనసాగించిన ఈ హీరోయిన్ ఇక పెళ్లి చేసుకుంది.


 ఏడాది నవంబర్ ఒకటవ తేదీన ఇటలీలో వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది అన్న విషయం తెలిసిందే  అయితే కొణిదెల వారి కోడలుగా తనకంటే సీనియర్ అయిన ఉపాసన బాటలోనే ప్రస్తుతం లావణ్య త్రిపాఠి కూడా వెళ్తుంది అన్నది తెలుస్తుంది. ఎందుకంటే కామినేని అనే బాగా పేరున్న ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ ఇక కొణిదెల కోడలుగా మారిపోయిన తర్వాత తన ఇంటి పేరును కొణిదెల అని మార్చుకుంది ఉపాసన. అంతేకాదు ఇక ఎంతో హుందాగా ఉంటూ కొణిదల కుటుంబానికి మరింత పేరు తీసుకువచ్చింది అని చెప్పాలి.


 ఇక ఇప్పుడు లావణ్య త్రిపాఠి కూడా తనకంటే సీనియర్ అయిన అక్క ఉపాసన బాటలోనే వెళుతుంది. ఇటీవల  ఇటీవల సోషల్ మీడియాలో లావణ్య త్రిపాఠి తన పేరు పక్కన కొణిదెల అని చేర్చింది  మొన్నటి వరకు లావణ్య త్రిపాటి అని మాత్రమే ఉండేది. ఇక ఆ పేరు చివరన కొణిదల కూడా యాడ్ చేసింది. కొణిదెల వారి కొత్త కోడలు అంటే ఇకనుంచి అందరూ కూడా ఆమెను లావణ్య త్రిపాఠి కొణిదల అని పిలవాలని కోరుకుంటుంది అని చెప్పాలి. ఇక ఇది చూసిన మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: