ప్రస్తుతం భారత జట్టు సౌత్ఆఫ్రికా పర్యటంలో ఉంది. ఇక ఈ పర్యటనలో భాగంగా ప్రస్తుతం టెస్టు సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. డిసెంబర్ 26వ తేదీ నుంచి ఈ టెస్ట్ సిరీస్ ప్రారంభమైంది. అయితే ఇక ఇప్పటికే వన్డే సిరీస్లో సఫారీ జట్టును సొంత గడ్డ మీదే మట్టి కరిపించి సిరీస్ ను కైవసం చేసుకున్న భారత జట్టు ఇక టెస్ట్ ఫార్మాట్లో కూడా ఇదే రీతిలో సత్తా చాటుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో భారత జట్టుకు మొదటి మ్యాచ్ లోనే చేదు అనుభవం ఎదురయింది.


 ఏకంగా భారత జట్టు బాగా రాణిస్తుంది అనుకుంటే ఎక్కడ సౌత్ ఆఫ్రికాకు పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో మొదటి మ్యాచ్ లో ఘోర పరాభవాన్ని చూసింది అని చెప్పాలి. 31 పరుగులతో పాటు ఒక ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించగలిగింది సౌత్ ఆఫ్రికా. దీంతో ఇక సౌత్ ఆఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్లో విజయం సాధించాలి అనే కలలుగన్న భారత్ కి  కలగానే మిగిలిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే భారత జట్టు ప్రదర్శన పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తూ ఉన్నాయి.  భారత బ్యాటింగ్ విభాగం ఎక్కడ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు అంటూ ఎంతో మంది క్రికెట్ విశ్లేషకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు.


 అయితే ఇటీవలే సౌత్ ఆఫ్రికా చేతిలో పరాభవాన్ని చవిచూస్తున్న టీమిండియాకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో కూడా ఊహించని షాక్ తగిలింది  ఏకంగా ఒకేసారి ఐదో స్థానానికి దిగజారిపోయింది భారత జట్టు. మొత్తం మూడు మ్యాచ్లు ఆడిన భారత్ ఖాతాలో ఒక విజయం ఒక ఓటమి ఒక డ్రా ఉన్నాయి అని చెప్పాలి. దీంతో 44.44  పర్సంటేజ్ ఉండడంతో 50 పర్సంటేజ్ పాయింట్లు కలిగిన బంగ్లాదేశ్ తర్వాత స్థానంలో నిలిచింది. మరోవైపు దక్షిణాఫ్రికా 100, పాకిస్తాన్ 61.1,  న్యూజిలాండ్ 50 పాయింట్లతో తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇదే లిస్టులో ఆస్ట్రేలియా 41.67 పాయింట్లతో ఆరో స్థానంలో ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: