ఈ క్రమంలోనే కష్టాల్లో ఉన్న టీమ్ ఇండియాను ఆదుకునే బ్యాట్స్మెన్ ఎవరు కనిపించలేదు అని చెప్పాలి. అయితే భారత జట్టు ఘోర ఓటమి తర్వాత ప్రస్తుతం టీమిండియా పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇక టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్లు అయినా అజింక్య రహానే, పూజారాలు టీం లో లేకపోవడం కారణంగానే భారత జట్టుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అంటూ ఎంతో మంది మాజీ క్రికెటర్లు కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు భారత జట్టు టెస్ట్ సిరీస్ ఆడుతున్నప్పుడు.. ఇలాంటి టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్లను పక్కన పెట్టడం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక ఇదే విషయంపై అటు మాజీ బౌలర్ హర్భజన్ సింగ్ కూడా స్పందించాడు.
టెస్ట్ ఫార్మాట్లో పూజారాని మించిన ఆటగాడు మరొకరు లేరు అంటూ హర్భజన్ వ్యాఖ్యానించాడు. రహానేను ఎంపిక చేయలేదు. పూజారాను కారణం లేకుండా తప్పించారు. వీరిద్దరూ ఎక్కడైనా పరుగులు సాధించగలరు. గత రికార్డులను పరిశీలిస్తే పూజార కూడా చాలా సార్లు కోహ్లీ లాంటి పాత్ర పోషించాడు. అతన్ని ఎందుకు తప్పించారో అన్నది ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. టెస్టు క్రికెట్లో మనకు ఇప్పటికీ కూడా పూజార కంటే బెస్ట్ బ్యాట్స్మెన్ లేడు. అతను నెమ్మదిగా ఆడుతాడు. కానీ జట్టును కాపాడుతాడు. అతని వల్లే ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ లలో టెస్ట్ ఫార్మాట్లో విజయాలు సాధించింది అన్న విషయాన్ని గుర్తు చేశాడు. కాగా జూన్లో ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో పూజార చివరిసారి ఆడాడు రెండు ఇన్నింగ్స్ లలో కలుపుకొని 41 పరుగులు మాత్రమే చేసి నిరాశ పరిచాడు. దీంతో జట్టు నుంచి అతన్ని తప్పించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి