ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో భాగంగా ఒక్కో మ్యాచ్ ఇక ఇండియాలోనే ఒక్కో వేదికగా జరుగుతూ ఉండడం గమనార్హం. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం జరిగింది. అయితే ఇప్పుడు రెండో టెస్ట్ మ్యాచ్ ఆంధ్ర ప్రదేశ్ లోనే విశాఖ వేదికగా జరుగుతూ ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే  ఇక ఇటీవలే రెండు టీమ్స్ కూడా రెండో టెస్టులో మొదటి ఇన్నింగ్స్ ను కంప్లీట్ చేసుకున్నాయి. అయితే భారత జట్టు రెండో టెస్టులో అటు బ్యాటింగ్ విభాగం లోనే కాదు బౌలింగ్ విభాగం లో కూడా సత్తా చాటింది అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఇక ప్రస్తుతం రెండో టెస్టు మ్యాచ్ లో ఇరు జట్లు కూడా హోరాహోరీగా పోరాడుతున్న నేపథ్యంలో ఇక ఈ మైదానంలో గత రికార్డులు ఎలా ఉన్నాయి విషయంపై కూడా ఎంతో ఆసక్తిగా అన్ని విషయాలను తెలుసుకుంటున్నారు భారత క్రికెట్ ప్రేక్షకులు  ఈ క్రమంలోనే ఇక ప్రస్తుతం మ్యాచ్ జరుగుతున్న విశాఖ మైదానం ఒక భారత జట్టుకు ఎంతో స్పెషల్ అన్నది తెలుస్తుంది  ఎందుకంటే గతంలో ఇదే మైదానంలో అటు టీమిండియా కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ ఏకంగా రెండు సెంచరీలు చేశాడు. ఇక ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అయ్యాడు. అదే సమయంలో ఇక టీమ్ ఇండియాకు ఈ మైదానంలో ఎన్నో స్పెషల్ రికార్డులు కూడా ఉన్నాయట. ఇటీవలే ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్టులో ఓపెనర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ చేసి అదరగొట్టి ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాడు. అంతే కాదు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని హెలికాప్టర్ షాట్ పరిచయమైంది కూడా ఈ స్టేడియంలోనేనట. 2005లో పాకిస్తాన్తో మ్యాచ్లో ధోని 148 పరుగులతో విజృంభించాడు. ఇక ఇదే మ్యాచ్లో హెలికాప్టర్ షాట్ కూడా ప్రపంచ క్రికెట్కు పరిచయమైంది  ఇక ఇదే గడ్డపై మయాంక్ అగర్వాల్, జైష్వాల్ డబుల్ సెంచరీలు చేయగా.. కోహ్లీ, పూజార, రోహితులు సెంచరీలు చేశారు. ఇలా ఈ మైదానం టీమిండియా కు ఎంతో స్పెషల్ గ్రౌండ్ గా కొనసాగుతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: