ఇండియన్ క్రికెట్లో ఉన్న టాలెంటెడ్ ప్లేయర్స్ లో సంజూ శాంసన్ కూడా ఒకరు. వికెట్ కీపర్ గా బ్యాట్స్మెన్ గా అతను ఎప్పుడు అద్భుతంగా రాణిస్తూ ఉంటారు  కానీ ఇప్పుడు వరకు మిగతా యువ ఆటగాళ్లతో పోల్చి చూస్తే సంజూ  శాంసన్ కు భారత జట్టులో అడపాదడప అవకాశాలు మాత్రమే దక్కాయ్. అయితే సెలెక్టర్లు కావాలని సంజూ శాంసన్ విషయంలో వివక్ష చూపుతున్నారంటూ గతంలో ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి  ఇప్పటికి కూడా ఇలాంటి విమర్శలు అప్పుడప్పుడు తెరమీదకి వస్తూ ఉంటాయి.


 అయితే నిలకడలేమి కారణంగానే సంజూ శాంసన్ ను జట్టులోకి తీసుకోవడం లేదు అనే కొంతమంది విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతూ ఉంటారు  ఎందుకంటే సంజు బాగా ఆడతాడు. కానీ ఒకటి రెండు మ్యాచ్ లలో మాత్రమే అతని బ్యాటింగ్ మెరుపులు కనిపిస్తాయని.. ఆ తర్వాత నిలకడలేమిటో అతను ఇబ్బంది పడుతూ జట్టుకు భారంగా మారిపోతాడని.. ఇక క్రికెట్ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతూ ఉంటారు. అయితే ఇక ఇప్పుడు ఐపీఎల్ లో మాత్రం సంజు అదరగొడుతున్నాడు. నిలకడలేమి ఉంటుంది అని విమర్శలు చేసిన ప్రతి ఒక్కరి నోరు మూయిస్తున్నాడు. వరుసగా మ్యాచ్లలో సూపర్ బ్యాటింగ్ తో చెలరేగిపోతూ ఉన్నాడు.


 ఒకవైపు కెప్టెన్గా జట్టు ను సమర్థవంతంగా ముందుకు నడిపించడమే కాదు వ్యక్తిగత ప్రదర్శన విషయంలో కూడా అదరగొడుతున్నాడు  అయితే ఇటీవల గుజరాత్ టైటాన్స్ తో రాజస్థాన్ రాయల్స్ ఆడిన మ్యాచ్లో జట్టు ఓడిపోయినప్పటికీ సంజు మాత్రం అరుదైన రికార్డు సృష్టించాడు. రాజస్థాన్ జట్టు తరఫున అత్యధిక 50 ప్లస్ స్కోర్ లు చేసిన బ్యాట్స్మెన్ గా నిలిచాడు సంజు. ఇప్పటివరకు ఆ జట్టు తరఫున 25 సార్లు 50 ప్లస్ స్కోర్ లు చేశాడు. అయితే అతని తర్వాత స్థానంలో బట్లర్ 24 సార్లు 50 ప్లస్ స్కోర్ లతో ఉన్నాడు. ఇక ఈ సీజన్లో ఇప్పటివరకు ఐదు మ్యాచ్లు ఆడిన సంజూ 246 పరుగులు చేశాడు. దీంతో మంచి ఫామ్ లో ఉన్న అతనికి టి20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కడం  ఖాయమని అభిమానులు అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl