(ఐ పీ ఎల్) సీజన్ మొదలైంది అంటే చాలు "ఆర్ సీ బీ" గురించి సోషల్ మీడియాలో రకరకాల మిమ్స్ రావడం, వార్తలు రావడం ప్రతి సీజన్ ముందు... జరుగుతున్నప్పుడు మనం చూస్తూనే వస్తున్నాం. ఇక "ఆర్ సీ బీ" లో ఎంత గ్రేట్ ప్లేయర్స్ ఉన్న వీరు ఎప్పుడు కూడా ట్రోఫీ నీ గెలవలేదు. దానితో ప్రతి సారి ఈ జట్టు అభిమానులు ఈ సీజన్ లో మా జట్టు ఈసారి ఖచ్చితంగా సూపర్ గా ఆడుతుంది అని అనుకుంటారు.

కానీ వీరు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా తమ ఆట తీరుతో ఈ జట్టు అభిమానులను ఎప్పుడు నిరుత్సాహపరుస్తూనే వస్తున్నారు. ప్రతిసారి లాగానే ఈ సీజన్ లో కూడా బెంగళూరు పై ఈ జట్టు అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ ఈ సీజన్ లోకి అడుగుపెట్టిన వీరు మొదట పర్వాలేదు అనే ప్రదర్శనలు కనబరిచారు. కానీ ప్రస్తుతం మాత్రం వీరు దిగజారిపోయిన పెర్ఫార్మన్స్ తో ప్రేక్షకులను, ఈ జట్టు అభిమానులను తీవ్ర నిరుత్సాహపరుస్తూనే వస్తున్నారు.

ఇప్పటివరకు బెంగళూరు జట్టు ఈ సీజన్లో 6 మ్యాచ్లను ఆడితే అందులో ఐదింటిలో ఓడిపోయి కేవలం ఒక్కదాంట్లో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో మరి దిగజారిన స్థితిలో ఉన్నారు. ఇక ప్రస్తుతం ఈ జట్టు అభిమానుల్లో ఉన్న ఒకే ఒక కోరిక మా టీం కనీసం ప్లే ఆప్స్ కైనా వెళుతుందా అని. ఇక బెంగుళూరు జట్టు కూడా ప్రస్తుతం ప్లే ఆఫ్ గురించే ఎంతో కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే బెంగళూరు జట్టు ఇంకో ఎనిమిది మ్యాచ్ లను ఆడవలసి ఉంది.

అందులో  7 మ్యాచ్లను గనక గెలిచినట్లు అయితే ఈ టీం ప్లే ఆఫ్ కి వెళ్లే అవకాశం ఉంది ... లేనట్లు అయితే ఈ జట్టు ఇంటికే వెళ్ళవలసి ఉంటుంది. ఈ టీం కనుక ప్లే ఆప్స్ కి వెళ్ళాలి అంటే ఇప్పటి నుండి అద్భుతమైన పర్ఫామెన్స్ ను కనబరిచావలసి ఉంది. మరి బెంగళూరు జట్టుఈ సీజన్ లో రాబోయే మ్యాచ్ లలో ఎలాంటి ఆట తీరును ప్రదర్శిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

rcb