ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగా సాగుతుంది. టైటిల్ వేటలో ప్రతి జట్టు కూడా తగ్గేదేలే అనుకుంటూ జోరును చూపిస్తుంది. అదే సమయంలో ఇక భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన కొన్ని టీమ్స్ మాత్రం చెత్త ప్రదర్శనలతో అభిమానులు అందరిని కూడా నిరాశ పరుస్తూ ఉండడం గమనార్హం. నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్న పోరు అసలు సిసలైన క్రికెట్ మజాను ప్రేక్షకులకు అందిస్తుంది. అయితే ఇక ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే ఈ ఐపీఎల్ సీజన్లో టైటిల్ విజేతగా నిలవబోయే టీం ఏది అనే విషయంపై ఒక అంచనాకు రాలేకపోతున్నారు ప్రేక్షకులు. ఎందుకంటే ఎప్పుడు ఏ టీం విజయం సాధిస్తుంది అనే విషయంపై ఒక క్లారిటీ లేకుండా పోయింది అని చెప్పాలి. చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగుతున్న మ్యాచ్ లో అనూహ్యమైన విజయాలు నమోదవుతున్నాయి. అయితే ఇప్పుడు ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా నేడు మరో ఆసక్తికరమైన మ్యాచ్ జరగబోతుంది. పంజాబ్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడబోతున్నాయి. చండీగఢ్ లోని ముల్లంపూర్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతూ ఉండడం గమనార్హం. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. అయితే పంజాబ్ రాజస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో ఈ టీమ్స్ మధ్య గత గణాంకాలు ఎలా ఉన్నాయి అన్న విషయం కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే టోర్నమెంట్ చరిత్రలో ఇప్పటివరకు ఈ రెండు టీమ్స్ కూడా 26 మ్యాచ్లలో తలబడ్డాయి. రాజస్థాన్ రాయల్స్ జట్టు 15 మ్యాచ్లో విజయం సాధిస్తే అటు పంజాబ్ కింగ్స్ జట్టు 12 మ్యాచ్ లలో విజయ డంకా మోగించింది. అయితే ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ జట్టు 8 పాయింట్లతో టాప్ లో ఉండగా.. మరోవైపు పంజాబ్ కింగ్స్ మాత్రం కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించి నాలుగు పాయింట్లతో ఇక పాయింట్లు పట్టికలో ఎనిమిదవ స్థానంలో కొనసాగుతుంది  అయితే ఇక నేడు జరగబోయే మ్యాచ్లో గెలుపు ఎవరిది అనే విషయంపై ఆసక్తి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: