భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ఇటీవల బిసిసిఐ టి20 వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన జట్టు సభ్యుల వివరాలను ప్రకటించింది. ఈ క్రమంలోనే ఈసారి వరల్డ్ కప్ లో ఎవరికి చోటు దక్కుతుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూడగా.. ప్రస్తుతం ఐపీఎల్ లో రాణిస్తూ ఫుల్ ఫామ్ లో ఉన్న ఆటగాళ్ళకి పెద్దపీట వేశారు టీమ్ ఇండియా సెలెక్టర్లు. ఈ క్రమంలోనే కొంతమంది కీలక ఆటగాళ్లకు ఊహించని రీతిలో చేదు అనుభవమే ఎదురైంది అని చెప్పాలి.


 అయితే తప్పకుండా వరల్డ్ కప్ జట్టులో చోటు సంపాదించుకుంటాడు అనుకున్న అటు కేఎల్ రాహుల్ ను మాత్రం సెలెక్టర్లు జట్టు ఎంపికలో పరిగణలోకి తీసుకోకపోవడం గమనార్హం. గత కొంతకాలం నుంచి అతను టీమిండియాలో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. మంచి టెక్నిక్ ఉన్న బ్యాట్స్మెన్ గా కూడా అతనికి గుర్తింపు. ఓపెనర్ గా బరిలోకి మంచి ఆరంభాలు అందిస్తూ ఉంటాడు. ఏ స్థానంలో బ్యాటింగ్ చేసిన రాణిస్తాడు. వికెట్ కీపర్ గా కూడా అతను సేవలందిస్తున్నాడు. అయితే ప్రస్తుతం ఐపీఎల్ సీజన్లో మాత్రం ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు కేఎల్ రాహుల్.


 దీంతో అతన్ని టి20 వరల్డ్ కప్ జట్టులో ఎంపిక చేసే అవకాశం తక్కువే అని అందరూ అనుకున్నారు. అందరూ అనుకున్నట్లుగానే సెలెక్టర్లు అతన్ని పక్కకు పెట్టారు. ఏకంగా ఓపెనర్ గా రోహిత్ శర్మకు జోడిగా యశస్వి జైస్వాల్ ఎంపిక చేశారు. దీంతో కేఎల్ రాహుల్ ని పక్కకు పెట్టేశారు. అయితే రాహుల్ లాంటి ప్లేయర్ని పక్కన పెట్టడంతో అతని అభిమానులు నిరాశకు గురయ్యారు. కనీసం రిజర్వ్డ్ బెంచ్ లో కూడా కేఎల్ రాహుల్ కి సెలక్టర్లు చోటు ఇవ్వకపోవడం గమనార్హం.

టీ20 ప్రపంచకప్ 20204 టోర్నీకి ఎంపికైన భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శివం దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్, జస్‍ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్

రిజర్వ్ ప్లేయర్లు: శుభ్‍మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్

మరింత సమాచారం తెలుసుకోండి: