జూన్ నెలలో ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ లో టైటిల్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకుంది బీసీసీఐ. గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ లో వరుసగా మ్యాచ్ లు గెలుస్తూ ఫైనల్ వరకు దూసుకుపోయిన.. ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి నిరాశపరిచింది. కానీ ఈసారి మాత్రం ఎలాంటి తప్పిదాలు చేయకుండా అత్యుత్తమ జట్టుతో బరిలోకి దిగడానికి రెడీ అయింది. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ టీం లో ఎవరికి చోటు దక్కుతుంది అనే విషయంపై ఉత్కంఠ ఉండగా.. ఆ ఉత్కంఠకు ఇటీవల తెరపడింది. t20 వరల్డ్ కప్ సభ్యులను ఇటీవల ప్రకటించింది బీసీసీఐ.


 ఈ క్రమంలోనే కొంతమంది ఆటగాళ్ల విషయంలో విశ్లేషకులు అంచనాలు తారుమారు అవుతున్నాయి. ఇక అసలు వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకోలేరు అనుకున్న ఆటగాళ్ళకు మాత్రం ఇక వరల్డ్ కప్ లో ఎంపిక చేశారు సెలెక్టర్లు. అలాంటి ప్లేయర్లను హార్దిక్ పాండ్యా ఒకరు. అతను టీం ఇండియాలో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్నాడు. కానీ ఇప్పుడు మాత్రం ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా సక్సెస్ కాలేకపోతున్నాడు. మరోవైపు వ్యక్తిగత ప్రదర్శన విషయంలో కూడా నిరాశ పరుస్తున్నాడు. బ్యాటింగ్లో పేలవ ప్రదర్శన చేస్తున్న హార్దిక్ బౌలింగ్ కి పూర్తిగా దూరంగా ఉంటున్నాడు. దీంతో అతనికి  వరల్డ్ కప్ లో చోటు దక్కడం  కష్టమే అని అందరూ అనుకున్నారు.


 కానీ ఊహించని రీతిలో అతన్ని సెలెక్టర్లు జట్టులో ఎంపిక చేశారు అని చెప్పాలి. అయితే ఇటీవల లక్నోతో జరిగిన మ్యాచ్లో కూడా గోల్డెన్ డకౌట్ గా వెనుతిరిగాడు హార్థిక్ పాండ్యా. ఇప్పటివరకు పది మ్యాచ్లలో కేవలం 197 పరుగులు మాత్రమే చేశాడు. ఇక బౌలింగ్లో నాలుగు వికెట్లు మాత్రమే తీశాడు. ఇలా ఫామ్ లో లేని పాండ్యాను టి20 వరల్డ్ కప్ కి ఎంపిక చేయడం పై విమర్శలు వస్తున్నాయి. ఐపీఎల్ లో అదరగొడుతున్న అభిషేక్, పరాగ్, ఋతురాజ్, తిలక్ వర్మ లాంటి ఆటగాళ్లను వదిలేసి.. ఫామ్ లో లేని హార్దిక్ పాండ్యాను సెలెక్ట్ చేయడం వెనుక సెలెక్టర్ల ఉద్దేశం ఏంటి అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. మరి హార్దిక్ పాండ్యాను సెలెక్ట్ చేయడంపై మీరేం అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: