నేడు ఐపీఎల్ లో మరో ఉత్కంఠ భరితమైన పోరుకి సమయం ఆసన్నమైంది. ప్లే ఆఫ్ లో అడుగుపెట్టబోయే నాలుగో టీం ఏది అనే విషయం నేడు జరగబోయే మ్యాచ్ తో తేలబోతుంది. ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య నేడు హోరహోరి సమరం జరగబోతుంది అని చెప్పాలి. ఇప్పటికే ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న ఛాంపియన్ టీం.. ఇక ఐపీఎల్ టైటిల్ కోసం 16 ఏళ్ల నుంచి కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తుంది. దీంతో ఈ రెండు టీమ్స్ మధ్య  మ్యాచ్ ఎలా ఉండబోతుందో అని అటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక రెండు జట్లు కూడా ఫుల్ ఫామ్ లో ఉన్నాయి. ఆర్సిబి గత నాలుగు మ్యాచ్ల నుంచి వరుస విజయాలు సాధిస్తూ జోరు చూపిస్తుంది. చెన్నై జట్టు మొదట్లో వరుస విజయాలు సాధించిన ఆ తర్వాత గెలుపు ఓటములు అంటూ పడుతూ లేస్తూ ముందుకు సాగుతోంది. దీంతో నేడు జరగబోయే మ్యాచ్ లో ఎవరు విజయ సాధిస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే నేడు జరిగే మ్యాచ్లో అటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించిన ప్లే ఆఫ్ కు వెళ్ళేది చెన్నై సూపర్ కింగ్స్ అంటూ కొంతమంది క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


 చెన్నై పై ఆర్సీబీ గెలిచిన.. ఇక కావాల్సిన గణాంకాలతో గెలవకపోతే ఉపయోగం ఉండదు అని చెప్పాలి. 20 ఓవర్లలో మ్యాచ్ జరిగితే ఇక చెన్నై పై 18 పరుగుల తేడాతో విజయం సాధించడమే కాదు.. ఒకవేళ లక్ష్య చేదన చేస్తే 18.1 ఓవర్ల లోనే లక్ష్యాన్ని చేదించాలి. వర్షం కారణంగా 5 ఓవర్లకే మ్యాచ్ కుదిస్తే.. బెంగళూరు మొదట బ్యాటింగ్ చేసి 80 పరుగులు చేస్తే.. చెన్నై ని 62 పరుగులకే కట్టడి చేయాలు.. ఒకవేళ చేదనలో అయితే 3.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేదించాలి. లేదంటే బెంగళూరు జట్టు గెలిచిన ప్లే ఆఫ్ కు మాత్రం చెన్నై వెళ్తుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl