ఈ రోజుతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో లీగ్ మ్యాచ్ లు పూర్తి కాబోతున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే ప్లే ఆప్స్ లోకి వెళ్లిన నాలుగు జట్లు ఏవి అనేది క్లియర్ గా తెలిసిపోయింది. అందులో ఇప్పటికే అత్యధిక పాయింట్లతో పాయింట్ల పట్టికలో నెంబర్ 1 స్థానంలో ఉన్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఇదే స్థానంలో కొనసాగబోతోంది. ఇక నిన్న మ్యాచ్ గెలిచి ప్లే ఆప్స్ లోకి లోకి ఎంట్రీ ఇచ్చిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్రస్తుతం నాలుగవ స్థానంలో ఉంది.

ఈ జట్టు కూడా ఇదే స్థానంలో ఉండబోతుంది. ఇక రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రస్తుతం 16 పాయింట్స్ తో రెండవ స్థానంలోనూ , సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు 15 పాయింట్లతో మూడవ స్థానంలోనూ ఉంది. ఈ రెండు జట్ల ఏ స్థానాలలో ఉండబోతున్నాయి. ఎవరితో వీరి తదుపరి మ్యాచులు ఉండబోతున్నాయి అనేది ఈ రోజుతో తేలిపోబోతుంది. ఇక ఈ రోజు ఆదివారం కావడంతో రెండు మ్యాచులు ఉండబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు సన్రైజర్స్ మరియు పంజాబ్ కింగ్స్ 11 మధ్య మ్యాచ్ స్టార్ట్ కానుంది.

ఈ మ్యాచ్ లో కనుక సన్రైజర్స్ జట్టు గెలిచినట్లు అయితే 17 పాయింట్లతో రెండవ స్థానంలోకి వచ్చే అవకాశం ఉంది. లేక ఈ మ్యాచ్ కనుక సన్రైజర్స్ ఓడిపోయినట్లు అయితే 15 పాయింట్లు తోనే మూడవ స్థానంలో కొనసాగే అవకాశం ఉంది. ఈ రోజు రాత్రి 7 గంటల 30 నిమిషాలకు రాజస్థాన్ రాయల్స్ మరియు కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ గెలిచినట్లు అయితే 18 పాయింట్లతో రెండవ స్థానంలోనే ఉంటుంది. అదే అదే సన్రైజర్స్ జట్టు గెలిచి రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయినట్లు అయితే రాజస్థాన్ రాయల్స్ మూడవ స్థానంలోకి పడిపోతుంది. మరి ఈ రోజు ఎవరు గెలుస్తారో..? ఎవరు ఓడుతారో..? ఎవరు ఏ స్థానంలో ఉంటారో అనేది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl