టీమిండియాలో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న హార్దిక్ పాండ్యాకు ఎంత ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ గా భారత జట్టులో అతని స్థానం ఎప్పటికీ ప్రత్యేకమే. ఎందుకంటే అతను జట్టులో ఉన్నాడంటే అదనంగా ఒక బౌలర్ ఇంకా అదనంగా మరో స్పెషాలిస్ట్ బ్యాట్స్మెన్ అందుబాటులో ఉన్నట్టే. అందుకే అతనికి అటు బిసిసిఐ సెలక్టర్లు కూడా ఎప్పుడు సెలక్షన్ విషయంలో పెద్దపీట వేస్తూ ఉంటారు. అయితే ఇక ఎప్పుడూ భారత జట్టు తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ పాండ్యా కూడా ఆకట్టుకుంటూ ఉంటాడు.


 క్రీజులో ఉన్నంత సేపు కూడా తన బ్యాటింగ్తో విధ్వంసం సృష్టించి ప్రత్యర్థి బౌలర్ల వెన్నులో వణుకు పుట్టిస్తూ ఉంటాడు. ఇక బౌలింగ్ లోను అద్భుతంగా రాణిస్తూ ఉంటాడు. కానీ అలాంటి హార్దిక్ పాండ్యా జాతకం లో శని ప్రభావం ఎక్కువగా ఉందా అంటే మాత్రం ఇక ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవును అని అంటున్నారు అభిమానులు. ఎందుకంటే గత కొంతకాలం నుంచి హార్థిక్ పాండ్యా తీవ్రస్థాయిలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. ఎన్నో రోజులపాటు గాయం కారణంగా క్రికెట్కు దూరమై మళ్ళీ ఐపీఎల్లో ప్రొఫెషనల్ క్రికెట్లోకి అడుగు పెట్టాడు. కానీ ఐపీఎల్ లోకి వచ్చిన తర్వాత కూడా అతనికి ఎదురు దెబ్బలు తప్పలేదు. ఐపీఎల్ లో ముంబై కెప్టెన్ గా ప్రకటించడంతో సొంత రాష్ట్రం దేశ ప్రజలతోనే చివరికి చీత్కారాలు  ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత ఇక ముంబై కెప్టెన్గా అతను ఘోరంగా విఫలం కావడంతో ఎంతో మంది అతనిపై విమర్శలు గుప్పించారు. అయితే ఇక ఇప్పుడు ఏకంగా భార్యకు విడాకులు ఇచ్చేశాడు అంటూ వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఇక  70శాతం ఆస్తులను భార్యకు ఇచ్చేందుకు ఒప్పుకున్నారు అంటూ టాక్ కూడా వినిపిస్తుంది. ఇలా ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉన్నాడు పాండ్య. ఇక ఇలాంటి సమస్యల మధ్య ఇక ఇప్పుడు వరల్డ్ కప్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఇలా గత కొంతకాలం నుంచి అతనికి ఏది కలిసి రావడం లేదు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: