బిసిసిఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నిలో అద్భుతమైన ప్రదర్శన చేయాలని అన్ని టీమ్స్ కూడా భావిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే టైటిల్ గెలవాలనే లక్ష్యంతో ప్రతి సీజన్లో బరిలోకి దిగుతూ ఉంటాయి. అయితే కొన్ని టీమ్స్ మాత్రమే ఇలా టైటిల్ గెలవాలి అనే కలలు నెరవేర్చుకుంటూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కూడా ఒకసారి ఇలా టైటిల్ అందుకుంది. 2016లో డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో ఇలా ఐపిఎల్ ఛాంపియన్గా నిలిచింది సన్రైజర్స్. ఇక ఈ మూమెంట్ అటు తెలుగు క్రికెట్ అభిమానులందరికీ కూడా ఎంతో స్పెషల్ అని చెప్పాలి.


 అందుకే ప్రతి ఏడాది కూడా ఇక టైటిల్ గెలిచిన క్షణాలను తెలుగు క్రికెట్ అభిమానులు అందరూ కూడా గుర్తు చేసుకుంటారు. 29వ తేదీన సన్ రైజర్స్ టైటిల్ అందుకోగా.. ఇక ఇదే రోజును సోషల్ మీడియాలో టైటిల్ గెలిచిన క్షణాలను గుర్తు చేసుకుంటూ పోస్టులు పెట్టడం చేస్తూ ఉంటారు. అయితే అటు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యానికి ఎంతో స్పెషల్ అయిన ఈరోజును ఆ ఫ్రాంచైజీ మర్చిపోయింది. ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. 2016 మే 29వ తేదీన ఆర్సిబి పై ఫైనల్ లో గెలిచి తొలిసారి ఐపిఎల్ కొట్టిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆరోజు ఎంతో స్పెషల్.


 అయితే నిన్న మే 29వ తేదీ కాగా.. అటు ఆ జట్టు యాజమాన్యం ఒక్క పోస్టు కూడా పెట్టలేదు. దీంతో అందరూ షాక్ అవుతున్నారు. అయితే డేవిడ్ వార్నర్ పై ఉన్న కోపం కారణంగానే సన్రైజర్స్  యాజమాన్యం ఈ పోస్టులు పెట్టలేదు అని అందరూ చర్చించుకుంటున్నారు. ఎందుకంటే అప్పుడు కెప్టెన్గా జట్టును ముందుకు నడిపించిన డేవిడ్ వార్నర్ కప్పు గెలిచిన సెలబ్రేషన్స్ కు సంబంధించి ప్రతి ఫోటోలో వీడియోలో ఉంటాడు. కాబట్టి ఇక ఈ సందర్భాన్ని సన్రైజర్స్ గుర్తు చేసుకోవడం లేదని ఎంతోమంది కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl