గత కొంతకాలం నుంచి ఎంతొ ఉత్కంఠ భరితంగా సాగుతున్న టీ20 వరల్డ్ 2024 ఎడిషన్ లో భాగంగా ఎంతొ ఉత్కంఠ భరితమైన పోరుకు సమయం ఆసన్నమైంది. వరుస విజయాలతో సూపర్ 8 వరకు దూసుకొచ్చిన టీమిండియాకు.. ఇక ఇప్పుడు ప్రతీకారం తీర్చుకునేందుకు ఛాన్స్ వచ్చింది. ఎందుకంటే ఏకంగా గత ఏడాది రెండు ఐసిసి టోర్నీలలో ఫైనల్లో తమను ఓడించి టైటిల్ కలను చెల్లా చెదురు చేసిన ఆస్ట్రేలియాను.. ఇక ఎప్పుడు వరల్డ్ కప్ నుంచి ఇంటికి పంపించే ఛాన్స్ టీమిండియా కు  వచ్చింది.


 సూపర్ ఇంట్లో భాగంగా ఇప్పటివరకు ఆఫ్గనిస్తాన్ బంగ్లాదేశ్ లతో జరిగిన మ్యాచ్లో.. ఘనవిజయాన్ని అందుకున్న టీమిండియా.. ఇక ఇప్పుడు నేడు జరగబోయే మ్యాచ్లో ఆస్ట్రేలియాను సైతం ఓడించి ఇక అదరగొట్టాలని భావిస్తుంది. ఈ విజయం ద్వారా ప్రతీకారం తీర్చుకోవాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తుంది. కాగా నేడు రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల క్రికెట్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రెండు పటిష్టమైన టీమ్స్ కావడంతో బంతికి బ్యాట్ కి మధ్య హోరాహోరీ  సమరం జరగడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు క్రికెట్ నిపుణులు. అయితే ఇలా జరిగితే ఆస్ట్రేలియా ఇంటికి వెళ్లడం ఖాయమే అంటూ ఒక వార్త ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. టి20 వరల్డ్ కప్ లో ఇటీవల సూపర్ 8 దశలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోయింది. దీంతో ఆ జట్టుకు సెమీఫైనల్ ఆశలు సంక్లిష్టంగా మారిపోయాయి. ఒకవేళ నేడు అటు భారత జట్టుతో జరగబోయే మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఓడిపోతే కొన్ని సమీకరణాలు కలిసి వస్తే చివరికి ఆస్ట్రేలియాను భారత జట్టు ఇంటికి పంపించడంలో సక్సెస్ అవుతుంది. భారత జట్టు చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోవడం కాదు.. బంగ్లాదేశ్ పై ఆఫ్గనిస్తాన్ గెలిస్తే ఆస్ట్రేలియా టోర్ని నుంచి ఎలిమినేట్ అవుతుంది. ఇలా జరిగితే సూపర్ 8 లో గ్రూప్ వన్ లో ఇండియా 6, ఆఫ్ఘనిస్తాన్ 4 పాయింట్ లతో సెమిస్ చేరుతాయి. ఒకవేళ ఇండియాపై ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ పై బంగ్లాదేశ్ గెలిస్తే ఇండియా, ఆస్ట్రేలియా సెమీఫైనల్ లో ఉంటాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: