ఇటీవల వెస్టిండీస్ యూఎస్ వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ 2024 ఎడిషన్ లో ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించి కప్పు గెలుచుకున్న తర్వాత రోహిత్ శర్మ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు. ఇక తన రిటైర్మెంట్కు ఇంతకన్నా మంచి శుభసందర్భం ఉండదు అంటూ రోహిత్ అభిప్రాయపడ్డాడు అనే విషయం తెలిసిందే. అయితే రోహిత్ రిటైర్మెంట్తో అభిమానులు కాస్త నిరాశ చెందిన మంచి సమయంలో రిటైర్మెంట్ ఆలోచన తీసుకున్నాడు అని ఆ తర్వాత అనుకున్నారు. ఇకపోతే ఇక ఇప్పుడు రోహిత్ రిటైర్మెంట్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. హిట్ మాన్ తన టి20 రిటైర్మెంట్ వెనక్కితీసుకుపోతున్నాడు అంటూ వార్తలు మొదలయ్యాయి.
దీనికి కారణం రోహిత్ శర్మ ఇటీవల చేసిన కామెంట్స్ కావడం గమనార్హం. చూడబోతే నేను టి20 నుంచి రిటైర్ అయినట్లుగా లేదు. కేవలం ఆ ఫార్మాట్ నుంచి నాకు రెస్ట్ ఇచ్చినట్లు ఉంది. 2025 ఆసియా కప్, 2026 t20 వరల్డ్ కప్ కు నన్ను మళ్ళీ పిలుస్తారేమో అనిపిస్తుంది అంటూ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. దీంతో రోహిత్ కు ఇంకా టి20 లో ఆడాలనే కోరిక ఉందని. ఒకవేళ టీమ్ ఇండియా నుంచి పిలుపు వస్తే రిటైర్మెంట్ను వెనక్కి తీసుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నాడు అంటూ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అది జరిగితే బాగుండు అని కోరుకుంటున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఇలా రిటైర్మెంట్ ప్రకటించడం మళ్ళీ ఆ రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకోవడం సర్వసాధారణంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే.