గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా సక్సెస్ అయిన హార్దిక్ పాండ్యాకు అటు భారత సెలెక్టర్లు తాత్కాలిక t20 కెప్టెన్ గా కూడా అవకాశాలు ఇవ్వడంతో అతనే ఫ్యూచర్ కెప్టెన్ అని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఇలాంటి సమయంలో హార్దిక్ పాండ్యాను వైస్ కెప్టెన్సీ నుంచి తొలగిస్తూ సెలెక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. గిల్ కూ అటు వన్డే టి20 లో వైస్ కెప్టెన్సీ అప్పగించారు అన్న విషయం తెలిసిందే. దీంతో టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ ఎవరు అనే విషయంపై మళ్లీ సందిగ్ధత నెలకొంది. ఎందుకంటే అటు రిషబ్ పంత్ కూడా మళ్ళీ కోలుకొని జట్టులోకి వచ్చి రాణిస్తున్నాడు. అతను మొదటినుండి కెప్టెన్సీ రేస్ లో ఉన్నాడు అన్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే టీమ్ ఇండియా ఫ్యూచర్ కెప్టెన్ గా ఎవరైతే బాగుంటుంది అనే విషయంపై టీమ్ ఇండియా మాజీ ఆటగాడు దినేష్ కార్తీక్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫ్యూచర్లో టీమ్ ఇండియాకు ఆల్ ఫార్మాట్ కెప్టెన్ అయ్యే అవకాశం కేవలం ఇద్దరు యువ ఆటగాళ్లకు మాత్రమే ఉంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేసాడు రిషబ్ పంత్. శుభమన్ గిల్ కూ ఆ సత్తా ఉందని చెప్పుకొచ్చాడు. ఇప్పటికే ఐపీఎల్ తో పాటు ఇండియాకి కొన్ని మ్యాచ్ లకు వీరిద్దరూ కెప్టెన్ గా వ్యవహరించారు అన్న విషయాన్ని గుర్తు చేశాడు. కాగా ప్రస్తుతం టీమిండియా టి20 సూర్యకుమార్ ఉండగా వన్డే టెస్ట్ లకు రోహిత్ సారథ్యం వహిస్తున్నాడు.