ఐపీఎల్ ప్లేఆఫ్స్ దగ్గర పడుతున్నాయనుకుంటే, సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ఓ బాంబు పేల్చింది. జూన్ 11 నుంచి ఆస్ట్రేలియాతో మొదలయ్యే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ కోసం తమ జట్టును ప్రకటించింది. ఈ దెబ్బకు మన ఐపీఎల్ ఫ్రాంచైజీలు, ముఖ్యంగా ముంబై ఇండియన్స్ (MI), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లకు పెద్ద చిక్కొచ్చి పడింది. ఎందుకంటే, ఆ జట్లలోని కీలకమైన సౌతాఫ్రికా ఆటగాళ్లు ప్లేఆఫ్స్‌కు ముందే టోర్నీ నుంచి చెక్కేసేలా ఉన్నారు.

సౌతాఫ్రికా టీమ్ జూన్ 3 నుంచి జూన్ 6 వరకు జింబాబ్వేతో నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ కూడా ఆడాల్సి ఉంది. మన ఐపీఎల్ ప్లేఆఫ్స్ ఏమో మే 29నే మొదలవుతాయి. అంటే, WTC ఫైనల్‌కు సెలెక్ట్ అయిన సఫారీ ప్లేయర్లు, ఒకవేళ వాళ్ల ఐపీఎల్ జట్లు ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లినా, నాకౌట్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవచ్చన్నమాట.

ముంబై ఇండియన్స్ నుంచి ర్యాన్ రికెల్టన్, కార్బిన్ బాష్, ఆర్‌సీబీ నుంచి లుంగి ఎంగిడి, ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ట్రిస్టన్ స్టబ్స్ వంటి ప్లేయర్లు సౌతాఫ్రికా WTC జట్టులో చోటు దక్కించుకున్నారు. వీళ్లే కాదు, మార్కో జాన్సెన్ (PBKS), ఐడెన్ మార్క్‌రమ్ (LSG), కగిసో రబాడ (GT), వియాన్ ముల్డర్ (SRH) కూడా ఈ లిస్టులో ఉన్నారు. వీళ్లంతా ఆ పెద్ద ఫైనల్‌కు రెడీ అవ్వడానికి ఐపీఎల్‌ను మధ్యలోనే వదిలేసి వెళ్లే సూచనలు గట్టిగా కనిపిస్తున్నాయి.

సౌతాఫ్రికా క్రికెట్ చరిత్రలో ఇది చాలా ముఖ్యమైన మ్యాచ్‌ అంట. అందుకే, క్రికెట్ సౌతాఫ్రికా (CSA) కూడా WTC ఫైనల్‌కు ఎంపికైన ఆటగాళ్లందరినీ ఐపీఎల్ గ్రూప్ స్టేజ్ ముగిసిన వెంటనే వచ్చేయమని ఆర్డర్ వేసే ఛాన్స్ ఉంది.

మరోవైపు, ఆస్ట్రేలియా కూడా తమ WTC ఫైనల్ జట్టును ప్రకటించింది. కామెరాన్ గ్రీన్ మళ్లీ జట్టులోకి రాగా, స్టీవ్ స్మిత్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్ వంటి పెద్ద తలకాయలంతా జట్టులో ఉన్నారు.

సౌతాఫ్రికా WTC ఫైనల్ స్క్వాడ్:

టెంబా బావుమా (కెప్టెన్), టోనీ డి జోర్జి, ఐడెన్ మార్క్‌రమ్, వియాన్ ముల్డర్, మార్కో జాన్సెన్, కగిసో రబాడ, కేశవ్ మహరాజ్, లుంగి ఎంగిడి, కార్బిన్ బాష్, కైల్ వెర్రెయిన్, డేవిడ్ బెడింగ్‌హామ్, ట్రిస్టన్ స్టబ్స్, ర్యాన్ రికెల్టన్, సెనురన్ ముత్తుసామి, డేన్ ప్యాటర్సన్.

ఆస్ట్రేలియా WTC ఫైనల్ స్క్వాడ్:

పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కొన్స్టాస్, మాట్ కుహ్నెమాన్, మార్నస్ లబుషేన్, నాథన్ లియాన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్‌స్టర్.

కీలకమైన సఫారీ ఆటగాళ్లు ఇలా అర్ధాంతరంగా వెళ్లిపోతే, వాళ్లపై ఆధారపడిన జట్ల ఐపీఎల్ ప్లేఆఫ్స్ ఆశలు గాల్లో దీపాలే మరి. చూడాలి ఏం జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: