2026లో భారతదేశంలో జరగనున్న టీ20 ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుంటే, ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2025లో పలువురు యువ ఆటగాళ్లు బ్యాట్, బాల్‌తో తమ ప్రతిభను చూపిస్తూ జాతీయ జట్టులో స్థానంకోసం గట్టిగా ప్రయత్నామ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అద్భుతమైన ప్రదర్శనలతో భారత టీ20 జట్టుకు విలువైన అవకాశాలుగా మారిన కొందరు ఆటగాళ్ల గురించి ఓ లుక్కేద్దాం..

ఇందులో మొదటగా చెప్పాల్సిన ఆటగాడు గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్న 22 ఏళ్ల ఓపెనర్ సాయి సుదర్శన్, ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో తన బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇప్పటి వరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో 56.09 సగటుతో 617 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, ఐదు అర్ధ సెంచరీలు ఉన్నాయి. వరుసగా మూడో సీజన్‌లో 350కి పైగా పరుగులు సాధించాడు. ఇక మరో ఆటగాడి గురించి మాట్లాడితే.. పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ కూడా గత మూడు సీజన్లుగా స్థిరంగా రాణిస్తున్నాడు. ప్రస్తుత సీజన్‌లో 12 మ్యాచ్‌ల్లో 458 పరుగులు నమోదు చేశాడు. పవర్‌ప్లేలో అటాకింగ్ బ్యాటింగ్, స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కోవడం అతని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.

ఇక ఢిల్లీకి చెందిన యువ బ్యాటర్ ప్రియాంష్ ఆర్య తన తొలి ఐపీఎల్ సీజన్‌లోనే అందరి చూపు అతనివైపు తిప్పుకున్నాడు. ఆడిన 12 మ్యాచ్‌ల్లో ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీతో 356 పరుగులు చేశాడు. ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా ఆడే అతని స్టైల్ తో సెలెక్టర్లను ఆకట్టుకుంటున్నాడు. గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్న ప్రసిద్ధ్ కృష్ణ కూడా ఆడిన 12 మ్యాచ్‌ల్లో 21 వికెట్లు తీసి టాప్ వికెట్‌టేకర్‌గా కొనసాగుతున్నాడు.కాబట్టి భారత బౌలింగ్ లైనప్‌లో విలువైన బౌలర్ గా నిలస్థుడు అనడంలో ఎటువంటి డౌట్ లేదు. .

ఇక లక్నో సూపర్ జెయింట్స్ తరుపున మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ఆయూష్ బదోని తన బ్యాటింగ్‌లో భారత జట్టులో చోటు సంపాదించేందుకు పోటీ పడుతున్నాడు. ప్రస్తుత సీజన్‌లో 329 పరుగులతో రాణించాడు. ఇక గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్న స్పిన్నర్ సాయి కిషోర్ కూడా 15 వికెట్లు తీసి జట్టు బౌలింగ్‌లో కీలకంగా మారాడు. మిడిల్ ఓవర్లలో
కంట్రోల్‌ స్పిన్ బౌలింగ్ చేయగలిగే అతని నైపుణ్యం భారత జట్టుకు మంచి స్పిన్ ఎంపిక కానుంది. ఇక డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ యష్ దయాల్ గతంలో ఎదురైన వాటిని జయించి రీఎంట్రీతో అదరగొడుతున్నాడు. అతను ప్రస్తుతం జట్టుకు కీలక బౌలర్‌గా మారాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: