
ఒకప్పుడు దూరదర్శన్లో ఉచితంగా మ్యాచ్‌లు చూసిన రోజులు గుర్తొస్తాయి. ఇప్పుడు మాత్రం ఓటీటీ యాప్స్ లేకుండా ఒక్క బంతీ చూడలేని పరిస్థితి. నెలసరి సబ్‌స్క్రిప్షన్ ₹500 నుంచి, వార్షిక ప్యాకేజ్‌లు రూ.1,500 – రూ.2,000 దాకా ఉన్నాయి. అంతే కాదు… ఒక యాప్‌లో అన్ని మ్యాచ్‌లు రావు. IPLకి వేరే, వరల్డ్‌కప్‌కి వేరే, బైలాటరల్ సిరీస్‌కి వేరే యాప్ సబ్‌స్క్రయిబ్ అవ్వాలి. అంటే అభిమానులు మ్యాచ్ కన్నా యాప్‌లకే ఎక్కువ డబ్బు కట్టాల్సి వస్తోంది. మరి హోటల్స్, పబ్బులు? వాళ్లకు కూడా ఇదే బిజినెస్. ఓటిటీల్లో సబ్‌స్క్రిప్షన్ తీసుకుని, స్క్రీన్ పెడతారు. కానీ అక్కడ కూర్చోవాలంటే ఒక్క బీరు, ఒక్క స్నాక్స్‌కు వందల రూపాయలు వసూలు చేస్తారు. అంటే అక్కడికెళ్లినా లాగానే జేబు ఖాళీ అవుతుంది. క్రికెట్ ఇప్పుడు లగ్జరీ స్పోర్ట్. మనసారా అభిమానించే గేమ్ చూసుకోవడానికి కూడా డబ్బున్నవాళ్లకే అవకాశం లభిస్తోంది. "సామాన్యుల ఆట" అనిపించే క్రికెట్ ఇప్పుడు "ఎలైట్ క్లాస్ ఎంటర్‌టైన్‌మెంట్" అయిపోయింది.
ఇక అదీ కాకుండా, మ్యాచ్ ఫిక్స్ అవుతుందా, లేదా అసలు ఆట న్యాయంగా జరుగుతుందా అన్న అనుమానాలు వేరే. కానీ అయినా ఫ్యాన్స్ మాత్రం ఆలోచించకుండా టికెట్లు, సబ్‌స్క్రిప్షన్లు కొంటూనే ఉన్నారు. ఎందుకంటే వాళ్లకి క్రికెట్ మోజు మితిమీరింది. ప్రశ్న ఒక్కటే – ఇలా డబ్బులు వసూలు చేస్తూ క్రికెట్‌ను బంగారు గూస్‌గా మార్చేస్తే… మిగిలేది గేమ్ పై ప్యాషన్‌నా? లేక డబ్బు కోసం ఆడే బిజినెస్‌నా? మొత్తానికి క్రికెట్ ఇప్పుడు మామూలు ప్రేక్షకుడి కంటికి దూరమవుతోంది. ఒకప్పుడు ప్రతి ఇంటి టీవీలో వినిపించే "హౌజ్‌ఫుల్ శబ్దాలు" ఇప్పుడు బుకింగ్ సైట్లు, ఓటిటీల చెల్లింపుల పేజీల్లోనే ఆగిపోతున్నాయి. క్రికెట్ నిజంగా అభిమానుల ఆటేనా? లేక డబ్బు ఉన్నవాళ్లకే రిజర్వ్ చేసుకున్న బిజినెస్‌నా? జవాబు కనుక్కోవాల్సిందె .. అభిమానులే..!