సెప్టెంబర్ 28 ఆదివారం దుబాయ్ వేదికగా పైనల్ లో ఇండియా పాకిస్తాన్ జట్లు తలపడబోతున్నాయి.. ఇక 17వ ఆసియా కప్ లో 8 జట్లు బరిలో నిలవగా ఫైనల్ కి ఇండియా పాకిస్తాన్ లు వెళ్లాయి. అయితే ఇందులో కొత్తేముంది అని మీకు డౌట్ రావచ్చు.కానీ 41 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలో ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఈ పరిణామం జరగలేదట.అదేంటంటే ఇన్నేళ్లుగా ఆసియా కప్ జరుగుతుంది కానీ ఎన్నడూ కూడా ఫైనల్ లో పాకిస్తాన్ భారత్ తలపడలేదట.కానీ ఈసారి మాత్రం ఫైనల్ కి భారత్ పాకిస్తాన్ జట్లు వెళ్లాయి. ఇక మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఒకే ఎడిషన్లో రెండు జట్లు వరుసగా మూడుసార్లు ఢీకొట్టడం కూడా ఇదే మొదటి సారట. అయితే 41 ఏళ్ల క్రితం అంటే 1984లో ఆసియా కప్ స్టార్ట్ అయింది.ఆ సమయంలో కేవలం మూడు జట్లు మాత్రమే ఉండేవి.
 
 కానీ ప్రస్తుతం 8 జట్లు అయ్యాయి. ఇక ఈ ఆసియా కప్ విజేతల్లో ఎక్కువసార్లు ఇండియా విజయం సాధించగా ఆ తర్వాత స్థానంలో శ్రీలంక ఆరుసార్లు కప్పు గెలిచింది. ఇక పాకిస్తాన్ మాత్రం రెండుసార్లు గెలిచింది. ఇక 41ఏళ్ల ఆసియా కప్ చరిత్రలో మొట్టమొదటిసారి ఫైనల్ లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఢీ కొట్టడం చూడబోతున్నాం. ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఫైనల్ లో తలపడలేదు.కానీ మొదటిసారి ఈ జట్లు ఫైనల్లో ఢీ కొట్టబోతున్నాయి. అంతేకాకుండా ఆసియా కప్ చరిత్రలో భారత్ ఒకే ఎడిషన్లో మూడుసార్లు పాకిస్తాన్ తో ఎప్పుడు ఢీకొట్టలేదు. కానీ ఈ 2025 లో మాత్రం ఒకే ఎడిషన్ లో మూడు సార్లు పాకిస్తాన్ తో ఢీ కొట్టబోతుంది. ఇక ఈ రెండు జట్లు ఇప్పటికే రెండుసార్లు తలపడ్డాయి.


ఆ రెండు సార్లు కూడా పాకిస్తాన్ పై టీమిండియా విజయం సాధించింది. ఇక ఫైనల్ లో కూడా పాకిస్థాన్ ని ఓడించడానికి టీమిండియా పోరుకు సిద్ధమైపోయింది. పహల్గాం అటాక్ జరిగాక పాకిస్తాన్ తో ఇండియా ఆసియా కప్ ఆడుతుందని తెలియడంతో చాలామంది టీమిండియాని విమర్శించారు. కానీ ఏసీసీ తో పాటు ఐసిసి నిబంధనల ప్రకారం పాకిస్తాన్ తో ఇష్టం లేకున్నా సరే టీమిండియా తలపడాల్సి వస్తుంది.ఇక టీమిండియా ప్లేయర్లు పాకిస్తాన్ ప్లేయర్స్ కి షేక్ హ్యండ్ ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు. ఇక ప్రస్తుతం భారత్ ముందు ఉన్న అతిపెద్ద సవాల్ ఫైనల్లో పాకిస్తాన్ ని ఓడించడమే. ముచ్చటగా మూడోసారి పాకిస్తాన్ పై విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని టీమిండియా ఆటగాళ్లు చూస్తున్నారు.మరి ఆదివారం జరగబోయే మ్యాచ్ లో ఏం జరుగుతుందో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: