ఒక్కోసారి అద్భుతాలు అనుకోకుండా జరిగిపోతూ ఉంటాయి.. కానీ అవి రికార్డులుగా నిలుస్తాయి. తాజాగా t20 హిస్టరీలోనే ఒక అద్భుత మ్యాచ్ జరిగిందని చెప్పవచ్చు. ఈ మ్యాచ్ గురించి తెలుసుకుంటే అందరూ ఆశ్చర్య పోవాల్సిందే.. ఇంతకీ ఈ మ్యాచ్ లో జరిగిన అద్భుతం ఏంటో ఆ  వివరాలు చూద్దాం.. సెప్టెంబర్ 5 2024లో  టి20 ప్రపంచ కప్ కు సంబంధించి ఆసియా క్వాలిఫైయర్ మంగోలియా వర్సెస్ సింగపూర్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో మంగోలియా మొదటగా బ్యాటింగ్ ఎంచుకుంది.. ఈ మ్యాచ్ లో మంగోలియా పూర్తిగా విఫలం అయిపోయి పది పరుగులకే ఆల్ అవుట్ అయింది.. ఇందులో ఐదుగురు బ్యాటర్స్ కనీసం ఖాతా కూడా తెరవలేకపోయారు. ఈ మ్యాచ్ లో సింగపూర్ కు చెందినటువంటి హర్షు భరద్వాజ్ అనే బౌలర్  4 ఓవర్లలో మూడు పరుగులు ఇచ్చి, ఆరు వికెట్లు తీశాడు. అందులో రెండు మెయిడెన్స్ కూడా ఉన్నాయి. 

అక్షయ్ పూరి కూడా నాలుగు ఓవర్స్ లో నాలుగు పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒక  మెయిడెన్ ఉంది. ఈ విధంగా మంగోలియా జట్టు మొత్తం పది పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్ ఎంచుకున్న సింగపూర్ కేవలం 5 బంతుల్లోనే  లక్ష్యాన్ని ఛేదించింది. ఈ టైంలో ఒక వికెట్ కోల్పోయి సింగపూర్ 13 పరుగులు చేసి విజయాన్ని సాధించింది. ఇందులో విలియం సిమ్సన్ రెండు బంతుల్లో ఆరు పరుగులు, రౌల్ శర్మ రెండు బంతుల్లో ఏడు పరుగులు చేసి విజయాన్ని సాధించారు.

ఈ విధంగా టి20 వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా మంగోలియా నిలిచిందని చెప్పవచ్చు. నిజానికి క్రికెట్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం.. ఇందులో టి20 ఫార్మాట్లో  ఇలాంటి అరుదైన ఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఒక్కోసారి కొన్ని జట్లు 300 పరుగులకు పైగా చేస్తే మరికొన్ని జట్లు స్వల్ప స్కోర్ కే ఆల్ అవుట్ అవుతూ ఉంటాయి. ఆ విధంగానే మంగోలియా జట్టు కూడా స్వల్ప స్కోర్ తోనే మ్యాచ్ ముగిసేలా చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: