భారత క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి వార్తలపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇప్పటికే పెళ్లికి ఒకరోజు ముందుగా తండ్రి స్మృతి తండ్రి కి హార్ట్ ఎటాక్ రావడంతో ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. అలా స్మృతి మంధాన తండ్రి హాస్పిటల్ పాలవ్వడంతో కుటుంబం మొత్తం విషాదంలో మునిగిన వేళ స్మృతి  మంధానికి కాబోయే భర్త కూడా అస్వస్థతకు గురవ్వడంతో ఆయన్ని కూడా హాస్పిటల్ లో చేర్పించారు అంటూ పలు వార్తలు వినిపించాయి. అలా ఒకేసారి ఇద్దరికీ ఇలా జరగడంతో స్మృతి మంధాన జాతకంలో ఏదో దోషం ఉందని,అందుకే ఇలా జరిగిందని కొంతమంది రాసుకోచ్చారు. ఇలా స్మృతి మంధాన పెళ్లి గురించి వైరల్ వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా మరో వార్త సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. అదేంటంటే.. స్మృతి మంధానకి కాబోయే భర్త కొరియోగ్రాఫర్ తో జంప్ అయ్యాడని అందుకే స్మృతి పెళ్లి వాయిదా పడినట్టు ఒక కొత్త వార్త వెలుగులోకి వచ్చింది.

 స్మృతి మంధాన సంగీత స్వరకర్త అయినటువంటి పలాష్ ముచ్చల్ ని పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. గ్రౌండ్లో పలాష్ ముచ్చల్ స్మృతి మంధానాకి ప్రపోజ్ చేసిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ గా మారాయి. అలాగే వీరిద్దరికి సంబంధించిన ఎంగేజ్మెంట్, సంగీత్, మెహందీ ఈ వీడియోలన్నింటికి కూడా సోషల్ మీడియాలో లక్షల లైక్స్ వచ్చాయి. అయితే స్మృతి మంధాన తండ్రికి పెళ్లికి ముందు గుండెపోటు రావడంతో ఆయన్ని హాస్పిటల్ కి తరలించి తాత్కాలికంగా పెళ్లి వాయిదా వేసుకున్నట్టు స్మృతి మంధాన మేనేజర్ ప్రకటించారు.అయితే ఇదంతా బాగానే ఉన్నప్పటికీ స్మృతి మంధాన తనకి కాబోయే వాడితో దిగిన ఎంగేజ్మెంట్ ఫోటోలు,ప్రపోజ్ చేసిన ఫోటోలు, వీడియోలు,సంగీత్ వీడియోలు ఇవన్నీ కూడా తన ఇంస్టాగ్రామ్ ఖాతా నుండి డిలీట్ చేయడంతో కొత్త అనుమానాలు తెరపైకి వచ్చాయి. 

అయితే ఏదో బలమైన కారణం ఉంటే తప్ప స్మృతి మంధాన ఈ ఫోటోలు, వీడియోలు డిలీట్ చేయదు.దీని వెనక ఏదో జరిగే ఉంటుందని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్న సమయంలోనే ఒక కొత్త రూమర్ బయటికి వచ్చింది.స్మృతి మంధానకి కాబోయే భర్త పెళ్లికి ముందు రోజు రాత్రి కొరియోగ్రాఫర్ తో కలిసి తనని చీట్ చేశాడని, కొరియోగ్రాఫర్ తో పలాష్ ముచ్చల్ లేచిపోయాడని, అందుకే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి  హాస్పిటల్ అంటూ కొత్త డ్రామాలు మొదలు పెట్టారనే వార్త వైరల్ అవుతుంది. మరి సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఈ వార్తలో ఎంత నిజం ఉంది..నిజంగానే కొరియోగ్రాఫర్ తో కలిసి స్మృతి మందానాన్ని పలాష్ ముచ్చల్ చీట్ చేశాడా.. వీరి పెళ్లి శాశ్వతంగా ఆగిపోయిందా అనేది తెలియాలంటే కచ్చితంగా స్మృతి మంధాన క్లారిటీ ఇవ్వాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: