ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా 5g స్మార్ట్ మొబైల్ ని తీసుకోవాలని చూస్తూ ఉన్నారు. అయితే మంచి బ్రాండ్ కోసం వెతుకుతున్న వారికి తాజాగా ప్రముఖ దిగ్గజ సంస్థలలో ఒకటైన శాంసంగ్ ఒక క్వాలిటీ మొబైల్ ను విడుదల చేస్తోంది. ప్రస్తుతం కొత్త సంవత్సరం మార్కెట్లోకి విడుదల కాబోతున్న ఈ 5g స్మార్ట్ మొబైల్ గురించి తెలుసుకుందాం. సాంసంగ్ కొత్త సంవత్సరంలో గెలాక్సీ A సిరీస్ నుంచి రెండు కొత్త 5g మొబైల్స్ ను ఇండియాలో లాంచ్ చేసింది. జనవరి నెలలో విడుదల ఒకటి కాగా గెలాక్సీ A14-5G, మరొకటి గెలాక్సీ A23 -5G తో ఈ రెండు స్మార్ట్ మొబైల్స్ ని విడుదల చేయబోతోంది.

సాంసంగ్ గెలాక్సీ -A14-5G మొబైల్ ఫీచర్ :
కొన్ని నివేదికల ప్రకారం ఈ మొబైల్ డిజైన్ సామ్సంగ్ గెలాక్సీ A22 ఫ్లాట్ ఫ్రేమ్ ని కలిగి ఉంటుంది. ఈ మొబైల్ డిజైన్ లో పవర్ బటన్ , వ్యాల్యూ బటన్ కుడివైపుగా ఉన్నట్లు తెలుస్తోంది. మొబైల్ ముందు కెమెరా నాట్ డిస్ప్లే తో తయారు చేసినట్లు సమాచారం.6.5 అంగుళాల ఎల్సిడి డిస్ప్లేని కూడా మనం ఈ ఫోన్ లో చూడవచ్చు.  అంతేకాదు 90 HZ రిఫ్రెష్ రేట్ తో ఈ స్మార్ట్ ఫోన్ వస్తుంది. సాంసంగ్ ఫోన్లో వృత్తాకార రింగులలో ట్రిపుల్ కెమెరా సెటప్ లభిస్తుంది. మొత్తం 50 మెగాపిక్సల్ ప్రధాన కెమెరాతో పాటు మరో రెండు మెగా పిక్సెల్ కెమెరాలు ఉంటాయి. వీటితో పాటు ఎల్ఈడి ఫ్లాష్ లైట్ కూడా ఉంటుంది.

ఫోన్ 5000 MAH బ్యాటరీ, 15 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అందుబాటులోకి వస్తోంది. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా వన్ యు ఐ 5.0  తో పనిచేస్తుంది. అంతేకాదు ఈ ఫోన్ కేవలం 5g నెట్వర్క్ కి మాత్రమే సపోర్ట్ చేసేలా రూపొందించబడ్డారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్,  వైఫై,  3.5 MM జాక్ డ్యూయల్ సిమ్,  బ్లూటూత్ వంటి ఎన్నో ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: