పొకో నుంచి తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్ లతో 5జి స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. పోకో ఎక్స్5 ప్రో 5జి , 6 జిబి ర్యామ్ ఇంకా 128 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 22,999 కాగా, 8జిబి ర్యామ్ ఇంకా 256 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 24,999గా నిర్ణయించారు. Poco ఈ ఫోన్‌తో హెచ్ డిఎఫ్, ఐసిఐసిఐ బ్యాంక్‌తో కూడా భాగస్వామ్యం కలిగి ఉంది. అలాగే ఈ బ్యాంకులకు చెందిన క్రెడిట్ , డెబిట్ కార్డ్ లావాదేవీల ద్వారా హ్యాండ్‌సెట్ తీసుకోవడంపై ఫ్లాట్ మొత్తం రూ. 2000 తగ్గింపు అందుబాటులో ఉంటుంది.ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు కనుక ఫోన్‌ను కొనుగోలు చేస్తే మొత్తం 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందే వీలుంది. ఈ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు ఫిబ్రవరి 13 వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమైంది.ఇక పొకో , తాజా X-సిరీస్ స్మార్ట్‌ఫోన్ 6.67-అంగుళాల గల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120Hz , ఇది పూర్తి HD+ రిజల్యూషన్‌ను కూడా అందిస్తుంది.


ఇది డాల్బీ విజన్, HDR10+ కంటెంట్ వంటి ఫీచర్లకు సపోర్ట్ ఇస్తుంది.కొత్త Poco X5 Proలో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778G ప్రాసెసర్ ఇంకా గ్రాఫిక్స్ కోసం Adreno 642L GPU ఉన్నాయి. దీన్ని TSMC , 6nm ప్రాసెస్‌లో తయారు చేశారు. 6, 8జిబి ర్యామ్ ఎంపికలు ఫోన్‌లో అందుబాటులో ఇవి ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్‌లో 128 జిబి ఇంకా 256జిబి ఇంటర్నల్ స్టోరేజీతో ఆప్షన్ ఉంది. ఫోన్ ఆండ్రాయిడ్ 12  MIUI 14తో వస్తుంది.ఇక తాజా ఎక్స్-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో మార్కెట్లోకి వచ్చింది. ఈ ఫోన్ ఓఐఎస్ సపోర్ట్‌తో 108 మెగాపిక్సెల్ సాంసంగ్ HM2 సెన్సార్‌ను కలిగి ఉంది. హ్యాండ్‌సెట్‌లో 2-మెగాపిక్సెల్ మాక్రో ఇంకా 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌లు కూడా ఉన్నాయి. ఈ Poco ఫోన్‌లో సెల్ఫీ అలాగే వీడియో కాలింగ్ కోసం 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.ఈ కొత్త పొకో ఎక్స్5 ప్రో 5జి స్మార్ట్‌ఫోన్ 5000ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఇది 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: