సుమ కనకాల.. ఈ పేరును చిన్న పిల్లాడిని అడిగినా చెప్తాడు.. అంటే సుమ పేరుకు ఎంత క్రేజ్ ఉందో అందరికి తెలుసు. లెజెండరీ యాంకర్ గా ఆమె కెరియర్ ను కొనసాగిస్తోంది. ఇటు టీవీ షో లు , అటు ఆడియో ఫంక్షన్ లు అంటూ కెరియర్ ను సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తోంది. ఆమె భర్త రాజీవ్ కనకాల కూడా సినిమాల లో నటిస్తూ బిజీగా ఉంది. ఇది ఇలా ఉండగా ఆయన బుల్లి తెరపై సందడి చేయబోతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.. యాంకరింగ్ చేస్తున్నాడా లేక రియాలిటీ షో చేస్తున్నాడా అనేది తెలియాల్సి ఉంది.