బిగ్ బాస్ హౌస్ లో  సడన్ గా సమంత మెరిసి ఎంత.. అల్లరి చేసిందో అందరూ చూశారు. కొంటె అమ్మాయి శ్యామ్ మరి కాసేపు ఉంటే బాగుంటుంది అంటూ.. అనుకోని ప్రేక్షకులు లేరు. అలా  ఏడవ వారాన్ని సరదాగా.... సందడిగా సమంత ముగించగా... ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో 8వ వారం మొదలైంది. ఈ వారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది... ఇంటి సభ్యులు వారిని నామినేట్ చేయాలనుకుంటున్న వ్యక్తుల ఫోటోలను పగలగొట్టి వారి నామినేషన్ చేయడానికి గల కారణాలు చెప్పాల్సిందిగా బిగ్ బాస్ సూచించారు.

ఈ నామినేషన్ ప్రక్రియ లో అందరికంటే ఎక్కువగా అరియానా కాస్త ఎక్కువ బాధ పడి భావోద్వేగానికి గురైంది. లాస్య కూడా కొద్దిగా ఫైర్ అయ్యింది.ఎనిమిదో వారానికి గానూ అమ్మ రాజశేఖర్, మోనాల్, అఖిల్, లాస్య, మెహబూబ్, అరియానా ఎక్కువ నామినేషన్ ఓట్లతో నామినేట్ అయ్యారు. విజయ దశమి సందర్భంగా... ఇంటి సభ్యుల్లో కొందరు బతుకమ్మ ఆటను ఆనందంగా ఆడారు.

అవినాష్, అరియానా, మోనాల్, లాస్య అందరూ కలిసి బతుకమ్మ పాటలు పాడుతూ డాన్స్ చేస్తూ ఆటలు ఆడారు. ఆ తర్వాత నిమజ్జనం కూడా చేశారు. అందులో అరియానా, అవినాష్ మాత్రం పాటలతో అల్లరి చేస్తూ అందర్నీ నవ్వించారు. చివరకు స్మిమ్మింగ్ పూల్‌లో ఇద్దరూ కలిసి నిమజ్జనం చేశారు. అయితే ఇంట్లో మాత్రం ఈ నలుగురే బతుకమ్మ ఆడగా మిగిలిన వారు కాస్త దూరంగా ఉన్నారు. ఇది ప్రేక్షకులకు కొద్దిగా నిరాశ కలిగించినా... ఆ నలుగురు మాత్రం వారి పర్ఫామెన్స్ తో బిగ్ బాస్ ఇంటి ని ఆనందంతో నింపారు... ఇక ఇవాల్టి ఎపిసోడ్ లో... ఇంటి వాతావరణం ఎలా ఉండ బోతుందో తెలియాలి అంటే మరి కొంత సేపు వెయిట్ చేయాల్సిందే. మరి అంతగా ఏమి జరుగుతుందో ప్రేక్షకులంతా ఎదురు చూస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: