సోహెల్, అరియానా గొడవ పడిన సంగతి తెలిసిందే. సోహెల్ చాలా ఆగ్రహం తో అరియానాపైకి వెళ్లాడు. అరియానా కూడా అస్సలు తగ్గలేదు. తను కూడా సోహెల్ పైకి దూసుకెళ్లింది. అతనితో తీవ్ర వాగ్వాదం తరవాత కిందపడి బోరున విలపించింది. ఆ తరవాత ఈ గొడవ గురించి అరియానా తో సోహెల్ మాట్లాడే ప్రయత్నం చేశాడు. కానీ, అరియానా మాత్రం తన తప్పేమీ లేదని.. తాను చేసింది కరెక్ట్ అని సోహెల్‌కు స్పష్టం చేసింది. ఈ విషయాన్ని నాగ్ కాస్త సీరియస్ గా తీసుకున్నారు. అందుకే హాట్ టాపిక్ గా ఈ ఎపిసోడ్ మారిపోయింది.
కోపం టాస్క్‌లో అయితే కంట్రోల్ చేసుకుంటావు.. లైఫ్‌లో అయితే కంట్రోల్ చేసుకోలేవ?’’ అని సోహెల్‌ను నాగార్జున ప్రశ్నించారు.. ఎవరు చేసిన ఫీల్ అవ్వ ని నువ్వు నిన్న ఈమె విషయమై ఎందుకు ఫీల్ అయ్యావని గట్టిగా ప్రశ్నించాడు. బిగ్ బాస్ గేమ్‌లో ప్రతి ఒక్కరూ సమానమే’’ అని అరియానాకు నాగార్జున క్లాస్ పీకడం ఈ ప్రోమోలో చూపించారు. మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా ఉండబోతోందని ప్రోమో చూస్తే అర్థమవుతోంది. అంతే కాదు, ఈరోజు నాగార్జున మరింత అందంగా కనిపిస్తున్నారు.. ఏమైనా జరగవచ్చు.. మోనాల్ ఔట్ అనే టాక్ కూడా వినపడుతుంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి