ప్రేమి విశ్వ‌నాథ్...ఈ పేరు చెప్తే ఎంత మంది గుర్తు పట్టిన పట్టకపోయిన వంటలక్క అంటే మాత్రం అందరు ఇట్టే గుర్తు పట్టేస్తారు. బుల్లితెరపై ఈ పేరు ఒక ప్రభంజనం. ఈ మలయాళీ ముద్దుగుమ్మ కార్తీక దీపం సీరియల్ ద్వారా తెచ్చుకుంటున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. స్టార్ హీరోయిన్స్ , స్టార్ హీరోస్ ఎవరు ఈ వంటలక్క ముందు పనికిరారు. ఎలాంటి సినిమా టీవిలో వచ్చిన దానికి వచ్చే రేటింగ్ కార్తీక దీపం సీరియల్ తర్వాతే. అంతలా ఫాలోయింగ్ తెచ్చుకుంది ప్రేమి విశ్వనాధ్. ఆమె ఇప్పటి వరకు తెలుగు తెరపై చేసింది ఒకే ఒక సీరియల్ అయినప్పటికీ ఆమెను దాటి ఎవరు ముందుకు వెళ్లలేకపోతున్నారు. ఇది ఇలా ఉంటే ప్రేమి ప్రముఖ యాంకర్ అయినా సుమ తో కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది.

ఈ ఇద్దరు మలయాళీలు ఒకే ఫ్రేమ్ లో కనిపించేసరికి అభిమానుల ఆనందానికి అవధులు లేవు.  ప్రేమి విశ్వనాధ్ మామూలుగానే సోషల్ మీడియా లో చాల యాక్టీవ్ ఉంటారు. తన జీవితంలో జరిగే ముఖ్యమైన విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఇక చీర కట్టుతో ఆమె ఈ మధ్య పెడుతున్న ఫోటోలకు సైతం మంచి ఆదరణ లభిస్తుంది. ఇక సుమ తో కలిసి పెట్టిన ఫోటో చుసిన అభిమానులకు సందేహం రానే వచ్చింది. ఈ ఇద్దరు కలిసి ఎందుకు ఫొటోస్ దిగారు అని. అందుకు సమాధానంగా అసలు విషయం బయటకు వచ్చింది. యాంకర్ సుమ ఇప్పటికే డబల్ హార్స్ మినపగుళ్ళు కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు సుమ తో కలిసి మన వంటలక్క కూడా చేరింది. ఇద్దరు కలిసి ఈ బ్రాండ్ కి సంబందించిన యాడ్ షూట్ చేసిన సమయంలో దిగిన ఫోటోలని వంటలక్క ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిందట. ఇలా ఇద్దరు మలయాళీలు కలిసి మినపగళ్ళు యాడ్ ని తెగ ప్రమోట్ చేసే పనిలో ఉన్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: