బిగ్ బాస్.. ఈ పేరు వినగానే నాలుగు సీజన్లు గుర్తుకు వస్తాయి. అలాంటిది నాలుగు సీజన్లలో పాల్గొని రచ్చ చేసిన ఇంటి సభ్యులు ఒకే చోట చేరితే ఇంక రచ్చ రంబోలానే..ఇపుడు మాటీవీ అలాంటి ప్రయత్నం చేస్తున్నారు.మళ్లీ నాల్గో సీజన్ మొత్తం ఒకే సారి చూసినట్టు అందరికీ అనిపించింది.బిగ్ బాస్ ఉత్సవం పేరిట రాబోతోన్న ప్రోగ్రాంలో కంటెస్టెంట్లందరూ కూడా దుమ్ములేపుతున్నారు. ఇదివరకే నాలుగో సీజన్ కంటెస్టెంట్లు చేసిన సందడి అంతా చూశాం. అయితే మిగిలిన మూడు సీజన్ల కంటెస్టెంట్లు చేయనున్న సందడి రానున్న ఆదివారం ప్రసారం కాబోతోంది. 


ఈలోపు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేందుకు అదిరిపోయే ప్రోమోలను రెడీ చేశారు. తాజాగా ఓ ప్రోమో బయటకు వచ్చింది. ఆ వీడియో ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. బిగ్ బాస్ ఇంట్లో ఇచ్చే టాస్కులు ఆడి చాలా రోజులైనందున అందరికీ నాటి రోజులను గుర్తుకు తెచ్చారు. ఐస్ క్రీంలు తినడం, గోడకు పిడకలు కొట్టడం వంటి టాస్కులను ఇచ్చారు. ఇక చివరగా మూడు సీజన్ల విజేతలకు మరో టాస్క్ ఇచ్చారు. ఆ ముగ్గురు రంగంలోకి దిగారు.


సైక్లింగ్‌ అంటూ శివ బాలాజీ, కౌశల్, రాహుల్ సిప్లిగంజ్ మధ్య పోటీ పెట్టారు. ముగ్గురికి ముగ్గురూ అరివీరభయంకరంగా పోటీ పడుతున్నారు. మరీ ఈ ముగ్గురిలో ఎవరు గెలుస్తారు.. ఎవరు ఓడిపోతారు.. ఇక మరి వారి వారి ఫ్యాన్స్ మళ్లీ సోషల్ మీడియాలో వార్ పెడతారేమో చూడాలి..రెండు వారాలుగా బిగ్ బాస్ ఉత్సవంకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ షో సీజన్ల కంటెస్టెంట్లందరినీ ఒకే చోట చూడటంతో అందరూ తెగ సంబరపడిపోయారు. ఏది ఏమైనా కూడా ఈ విధంగా చేయడం మంచి పనే..కానీ బిగ్ బాస్ లో లాగా గొడవలు పెడుతుంది. ఆదివారం ఏమౌతుందో చూడాలి...

మరింత సమాచారం తెలుసుకోండి: