
ప్రస్తుతం ఓంకార్ మాటీవీలో,యాంకర్ గా బాగా పేరు తెచ్చుకోవడంతో పాటు, ప్రస్తుతం సిక్స్త్ సెన్స్ అనే ప్రోగ్రాం ను నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఇందులోకి గెస్ట్ గా బుల్లితెరపై నటిస్తున్న సుధీర్ , ఇంద్రజలు పాల్గొన్నట్లు ప్రోమోలో వెల్లడించడం జరిగింది. ఇక ఇదే మొదటిసారిగా సుడిగాలి సుధీర్ స్టార్ మా ఛానల్ లో అడుగు పెట్టడం జరిగింది.
ఆ షో లో జరిగేటువంటి ఒక గేమ్ లో భాగంగా.. ఇంద్రజ పై ఓంకార్ కి ఉన్న బంధాన్ని తెలియజేశాడు సుడిగాలి సుదీర్. సుధీర్ ఓంకార్ ని మీ పెద్ద కుమారుడు మధ్యలోనే..అంటూ సాగదీస్తుండగానే.. వెంటనే ఇంద్రజ నా కుమారుడు ఓంకార్ అని నీకు చెప్పాను అని తెలిపింది. ఇక సుధీర్ నాకు మీరు అమ్మ లాంటి వాళ్ళు. ఓంకార్ అన్నయ్య లాంటివారు అని తెలపగా.. సమాజంలో నన్ను అన్నలా భావించేవారు అందరూ నాకు కుమారులతో సమానం.. అనే సరికి తెల్లమొహం పెట్టేశాడు.
ఇక ఇదంతా కేవలం ఈ షోలో భాగమేనని, తెలియజేశారు ఇంద్రజ,సుడిగాలి సుధీర్. ఇక ఓంకార్ విషయానికి వస్తే, ఈయన ఎక్కువగా సస్పెన్స్ ఉండేటువంటి షోలనే ఎంచుకుంటాడు. ఈ షోలో ఎంతో మంది ప్రముఖ స్టార్స్, గెస్ట్ లుగా రావడం జరుగుతోంది. అందువల్లనే ఈ షో కీ అంత పాపులారిటీ వస్తుంది.