బుల్లితెరపై ప్రస్తుతం హవా కొనసాగిస్తున్న వారిలో నటుడు, కమెడియన్ గెటప్ శ్రీను ఒకరిని చెప్పవచ్చు. ఇక ఈటీవీ మల్లెమాలవారు ఎక్కువగా పలు షోలలో అవకాశాలు ఇస్తూ గెటప్ శ్రీను ను తెగ ఉపయోగించుకుంటున్నారు అంటూ వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా గెటప్ శ్రీను నే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. ఈ కమెడియన్ యొక్క క్రేజ్ ను ఉపయోగించుకుంటూ ప్రతిస్ స్కిట్ కూడా ప్రతి ఎపిసోడ్ ఏదో ఒక గెటప్ వేయించి మొత్తం దృష్టి ఆయన మీద పడేలా చేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో గెటప్ శ్రీను ను ఒరిజినల్ గా ప్రేక్షకులు చూసిందే లేదు.


ఇక ఎప్పుడూ చూసిన ఏదో ఒక గెటప్ లో కనిపిస్తూ ఉండడంతో ప్రేక్షకులకు కూడా కాస్త శ్రీను మీద విసుగు వచ్చిందని చెప్పవచ్చు..త్వరలో రాబోతున్న దసరా ఈవెంట్ ఎపిసోడ్ లో ఏకంగా 10 గెటప్ లతో బుల్లితెరపై సందడి చేయబోతున్నట్లుగా సమాచారం. దీంతో కొంతమంది బుల్లితెర ప్రేక్షకులు ఈ విషయం తెలియగానే బాబోయ్ ఇన్ని పాత్రలు అవసరమా అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మల్లెమాలవారు గెటప్ శ్రీను ను బాగానే వాడేసుకుంటున్నారు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. వాళ్ల కేలాగో బుద్ధి లేదు కనీసం..మీరైనా ఆలోచించాలి కదా అంటూ మరికొంతమంది శ్రీను ను ప్రశ్నిస్తూ ఉన్నారు.


మరి కొంతమంది మాత్రం గెటప్ శీను 10 గెటప్ లలో కనిపించబోతున్నారు అంటే.. అది కచ్చితంగా కేవలం కమలహాసన్ లాంటి వారికి మాత్రమే సాధ్యమవుతుంది ఇప్పుడు అలాంటి గెటప్స్ ని గెటప్ శ్రీను వేయడం అంటే అది సాధ్యమవుతుందా అంటూ తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా బుల్లితెరపై కమలహాసన్ అనే పేరును కూడా సంపాదించారు గెటప్ శ్రీను.మరికొందరు మాత్రం గెటప్ శ్రీను ఓవరాక్షన్ చేస్తున్నారు అంటూ విమర్శలు చేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: