
హీరోయిన్గా మాత్రమే నటించేందుకు ఓకే చెబుతోందని ఏవైనా డీసెంట్ కథల కోసం వెయిట్ చేస్తోంది అన్నట్లుగా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. జబర్దస్త్ బ్యూటీగా పేరుపొందిన రష్మీ ప్రముఖ హీరో సినిమాలో ఐటెం సాంగ్ చేసే అవకాశం వచ్చిన కూడా రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. హీరోయిన్గా ఇప్పటికీ ఈమెకు పెద్దగా క్రేజీ లేకపోయినప్పటికీ స్పెషల్ సాంగ్లో చేసేందుకు మాత్రం నో అని చెప్పడంతో ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు. అయితే యాంకర్ అనసూయ మాత్రం తనకు వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా నటిస్తూ బిజీగా ఉంటోంది కానీ రష్మీ మాత్రం అలా కాలేకపోతోంది.
ఇక రష్మీ కూడా ఎప్పుడు సినిమాలలో హడావిడి చేయదు.బుల్లితెరపై ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటుంది తెలుగులో మాత్రమే కాకుండా రష్మీకు ఆ మధ్య తమిళం నుంచి కూడా పలు ఆఫర్లు వచ్చినట్లు వార్తలు వినిపించాయి. దీంతో రష్మీ వాటిని రిజెక్ట్ చేసినట్లు సమాచారం. రష్మీ తెలుగు తెరమీద మాత్రమే కాకుండా గ్లామర్ పాత్రలు వెండితెర పైన కూడా చూడాలని అభిమానులు కోరుకుంటూ ఉన్నారు. మరి రష్మీ సరైన సినిమా కథతో తమ అభిమానులను ఆనందపడేలా చేస్తుందేమో చూడాలి మరి. ఏది ఏమైనా ఈ మధ్యకాలంలో రష్మి సినిమాలకు గుడ్ బై చెప్పిందని వార్తలు వినిపిస్తున్నాయి.