హోలీ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా రంగుల తో బాగా ఎంజాయ్ చేశారు.. ముఖ్యంగా సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు రంగులతో ఎంజాయ్ చేసిన సందర్భాలను సోషల్ మీడియా ద్వారా చాలామంది తమ ఆనందాలను పంచుకున్నారు. ఇకపోతే తాజాగా యాంకర్ అనసూయ భరద్వాజ్ కూడా హోలీ పండుగను తన కుటుంబ సభ్యులతో చాలా ఘనంగా జరుపుకుంది అంతేకాదు ఆ ఫోటోలను అభిమానులతో పంచుకోవడానికి సోషల్ మీడియాలో షేర్ చేసింది. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యాంకర్ అనసూయ గురించి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. యాంకర్ గా కెరియర్ ను మొదలు పెట్టిన ఈమె ఇప్పుడు గట్టిగా చాలా పాపులారిటీ దక్కించుకుంది.

మొదట్లో టీవీలలో వార్తలు చెప్పిన ఈమె ఆ తర్వాత వెండితెరపై సైడ్ ఆర్టిస్ట్ గా కూడా నటించి మెప్పించింది. ఎప్పుడైతే బుల్లితెరపై జబర్దస్త్ లో యాంకర్ గా అవకాశం వచ్చిందా అప్పటినుంచి నిర్విరామంగా దాదాపు 9 సంవత్సరాలు పాటు యాంకర్ గా వ్యవహరించి తన గ్లామర్ తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది అంతేకాదు జబర్దస్త్ ద్వారా ఆమె ఫేట్ కూడా మారిపోయింది. అంతేకాదు ఇక్కడ నుండే తన పరిచయాన్ని పూర్తిగా మార్చేసుకున్న ఈమె సినిమాలలో వరుసగా అవకాశాలను అందుకుంది.. ముఖ్యంగా వెండితెరపై అవకాశాలను అందుకున్న ఈ ముద్దుగుమ్మ రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించింది ఈ పాత్ర ఆమెకు ఎంత క్రేజ్ తీసుకొచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇదిలా ఉండగా ఖాళీ సమయం దొరికితే చాలు సోషల్ మీడియాలో సందడి చేసే ఈమె హోలీ సందర్భంగా ఫోటోలు షేర్ చేయడంతో ఇక్కడ కూడా ట్రోల్ కి గురవుతోంది. ఇక ఈ ఫోటోలను చూసిన చాలామంది హ్యాపీ ఉమెన్స్ డే అంటూ అనసూయకు విషెష్ కూడా చెబుతున్నారు.. అయితే ఇదంతా పక్కన పెడితే ఒక నెటిజన్ మాత్రం ఎంత సెలబ్రిటీ అయినా కూడా హోలీకి పాత బట్టలు వేసుకోవాల్సిందే అంటూ  కామెంట్ చేయగా ఈ కామెంట్ చూసిన ఇతర నేటిజన్స్ కూడా అవును నిజమే కదా అంటూ సరదాగా నవ్వుకోవడం ఇప్పుడు మరింత వైరల్ గా మారింది.ఏది ఏమైనా అనసూయ పండగపూట కూడా పాత బట్టలు వేసుకోవడంతో మరొకసారి ట్రోల్స్ ఎదుర్కొంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: